Share News

Parenting Tips: పిల్లలు బడి నుంచి రాగానే

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:37 AM

నోట్స్‌ రాసుకున్నావా..? హోంవర్క్‌ ఇచ్చారా..? స్లిప్‌ టెస్టుల్లో మార్కులు ఎలా వస్తున్నాయి? ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ పిల్లలు అన్యమనస్కంగా సమాధానాలు ఇవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. బడి నుంచి రాగానే... పిల్లలను తల్లిదండ్రులు....

Parenting Tips: పిల్లలు బడి నుంచి రాగానే

ఉదయాన్నే బడికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చిన పిల్లలను తల్లిదండ్రులు రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇవాళ బడిలో ఏ పాఠాలు చెప్పారు..?

నోట్స్‌ రాసుకున్నావా..? హోంవర్క్‌ ఇచ్చారా..? స్లిప్‌ టెస్టుల్లో మార్కులు ఎలా వస్తున్నాయి? ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ పిల్లలు అన్యమనస్కంగా సమాధానాలు ఇవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. బడి నుంచి రాగానే... పిల్లలను తల్లిదండ్రులు ఏమి అడగాలో తెలుసుకుందాం...

  • పిల్లలు ఇంటికి రాగానే ఆ రోజంతా ఎంత ఆనందంగా గడిపారో అడిగి తెలుసుకోవాలి. స్నేహితులతో కలిసి ఆడిన ఆటలు, ఉపాధ్యాయుల పొగడ్తలు, మధ్యాహ్నం ఎవరితో కలసి భోజనం చేశారు? అన్న అంశాలు అడగాలి. పిల్లలు ఆ విషయాలన్నింటినీ గుర్తుచేసుకుంటూ ఉత్సాహంగా అన్ని విషయాలు చెప్పేస్తారు.

  • కొంచెం పెద్ద పిల్లలను మాత్రం.. ఉపాధ్యాయులు లేదా తోటి విద్యార్థులతో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో అడగాలి. దీనివల్ల తరగతి గదిలో పిల్లలకు ఎదురవు తున్న పలురకాల ఇబ్బందుల గురించి తెలుస్తుంది. వెంటనే ఉపాధ్యాయులతో చర్చించి పరిష్కారాలు వెతకవచ్చు.

  • బడిలో ఎంతమంది స్నేహితులు ఉన్నారు? వాళ్లతో ఎలా సమయం గడుపు తున్నదీ అడగాలి. అలాగే ఉపాధ్యాయులతో అనుబంధం ఎలా ఉన్నదీ అడిగి తెలుసు కోవాలి. తరగతి గదిలో ఒంటరిగా ఉండకుండా టీచర్లకు సహాయం చేస్తూ నాయకత్వ లక్షణాలను పెంచుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి.

  • ఈ రోజు బడిలో ఏ కొత్త విషయం నేర్చుకున్నావు? అని అడిగితే పిల్లలు కొద్దిగా ఆలోచించడం మొదలుపెడతారు. తమకు ఎదురైన కొత్త అనుభవాలను గుర్తుచేసుకుని మరీ చెబుతారు. దీనివల్ల పిల్లల్లో సంభాషణ సామర్థ్యం పెరుగుతుంది.

  • పిల్లలు బడికి వెళ్లడానికి ఇష్టపడకపోతే దానికి కారణం అడిగి తెలుసుకోవాలి. ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్థం కాకపోవడం, బోర్డు కనిపించకపోవడం, స్నేహితులు లేకపోవడం లాంటి కారణాలు ఉన్నాయేమో గమనించాలి.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 03:37 AM