Share News

How to Encourage Children: పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునేలా

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:51 AM

పిల్లలు ఎదుగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొన్నింటిని ప్రశ్నల ద్వారా, మరికొన్నింటిని కళ్లతో చూసి, ఇంకొన్నింటిని చేతల ద్వారా అవగాహన...

How to Encourage Children: పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునేలా

పిల్లలు ఎదుగుతున్న కొద్దీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొన్నింటిని ప్రశ్నల ద్వారా, మరికొన్నింటిని కళ్లతో చూసి, ఇంకొన్నింటిని చేతల ద్వారా అవగాహన చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...

  • పిల్లలు ఏవైనా ప్రశ్నలు అడిగినప్పుడు విసుక్కోకుండా ఓపికగా సమాధానాలు చెప్పాలి. మెల్లగా వాళ్లకి అర్థమయ్యే రీతిలో వివరించాలి. అప్పుడే పిల్లల్లో గ్రాహక శక్తి పెరుగుతుంది.

  • పిల్లలకు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించాలి. వాటిని పూర్తిచేసినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించాలి. దీనివల్ల పిల్లలు విజయాన్ని ఆస్వాదించడమే కాకుండా సవాళ్లను స్వీకరించడం నేర్చుకుంటారు.

  • కొంతమంది పిల్లలు ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టడానికి సంకోచిస్తూ ఉంటారు. దాన్ని సరిగా చేయలేమని అనుకుంటూ వెనకడుగు వేస్తుంటారు. అలాంటప్పుడు పిల్లలకు ధైర్యం చెప్పిఆ పనిని ప్రారంభించేలా ప్రోత్సహించాలి. తప్పులు జరగడం సహజమని వివరించాలి. మొదటి అడుగు వేయడానికి భయపడినప్పటికీ పిల్లలు క్రమంగా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ పనిని పూర్తిచేస్తారు.

  • పిల్లలకు ఏ అంశాల మీద ఆసక్తి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తగినవిధంగా ప్రోత్సహిస్తూ శిక్షణ ఇప్పిస్తే పిల్లలు నచ్చిన వాటిని చక్కగా నేర్చుకుంటారు.

  • పిల్లలకు సహనంగా వ్యవహరించడం అలవాటు చేయాలి. దీనివల్ల వారిలో ఆలోచన శక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అనుక్షణం ఎదురయ్యే సొంత అనుభవాలతో పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు.

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 01:51 AM