Bay Leaves Can Eliminate: బిర్యానీ ఆకుతో బొద్దింకలు మాయం
ABN , Publish Date - Sep 20 , 2025 | 02:57 AM
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో బొద్దింకల బెడద పెరిగిపోతూ ఉంటుంది. బజారు నుంచి రసాయనాలతో కూడిన స్ర్పేలు తెచ్చి వాడినా ప్రయోజనం కనిపించదు. అలాంటప్పుడు బిర్యానీ ఆకుతో...
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో బొద్దింకల బెడద పెరిగిపోతూ ఉంటుంది. బజారు నుంచి రసాయనాలతో కూడిన స్ర్పేలు తెచ్చి వాడినా ప్రయోజనం కనిపించదు. అలాంటప్పుడు బిర్యానీ ఆకుతో బొద్దింకలను ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకుందాం...
బొద్దింకలకు.. బిర్యానీ ఆకు వాసన పడదు. కాబట్టి వంటింట్లో ఉండే అరల్లో, సింక్ దగ్గర, బాత్రూమ్ మూలల్లో ఎండిన బిర్యానీ ఆకులను చిన్న ముక్కలుగా తుంచి ఉంచితే బొద్దింకలన్నీ బయటికి వెళ్లిపోతాయి. రెండు రోజులకోసారి ఈ ఆకులను తీసివేసి కొత్తవాటిని ఉంచుతూ ఉంటే బొద్దింకలు మళ్లీ రావు.
బాగా ఎండిన బిర్యానీ ఆకులను పొడిలా చేసి బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో చల్లితే రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది.
స్టవ్ మీద గిన్నె పెట్టి నిండా నీళ్లు పోసి రెండు బిర్యానీ ఆకులు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడబోసి ఒక స్ర్పే బాటిల్‌లో పోసి ఇంటి మూలల్లో, కిటికీల దగ్గర, సింక్‌ల దగ్గర పిచికారీ చేస్తే బొద్దింకల బెడద తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి..
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి