Share News

Turmeric Water Benefits: ఉదయాన్నే పసుపు నీరు తాగితే

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:14 AM

రోజు మన వంటల్లో పసుపును ఉపయోగిస్తాం. ఈ పసుపును గోరువెచ్చని వేడినీటిలో కలిపి, అందులో అల్లం, నిమ్మరసం, తేనె కలుపుకుని రోజూ పరగడుపున తాగితే ఎన్నో ప్రయోజనాలు..

Turmeric Water Benefits: ఉదయాన్నే పసుపు నీరు తాగితే

రోజు మన వంటల్లో పసుపును ఉపయోగిస్తాం. ఈ పసుపును గోరువెచ్చని వేడినీటిలో కలిపి, అందులో అల్లం, నిమ్మరసం, తేనె కలుపుకుని రోజూ పరగడుపున తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం...

  • శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

  • జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి.

  • ఆర్థరైటిస్‌, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

  • వాపులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి.

  • జీర్ణ సమస్యలు తగ్గి, పేగు కదలికలు మెరుగుపడతాయి.

  • మొటిమలు తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

  • కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  • మెదడు చురుగ్గా ఉంటుంది. అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

  • రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

  • ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

  • పసుపులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

  • పసుపులోకి కర్కుమిన్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 20 , 2025 | 01:14 AM