Share News

Engineering Services Examination 2026: ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2026

ABN , Publish Date - Oct 13 , 2025 | 07:18 AM

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ - 2026 కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని...

Engineering Services Examination 2026: ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2026

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ - 2026 కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఇంజనీరింగ్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు.

ఇంజనీరింగ్‌ సర్వీసులో సివిల్స్‌ లాంటి పోస్టులు ఇవి.

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌

విద్యార్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ తదితర అర్హతలు ఉండాలి.

వయస్సు: 2026 జనవరి 1 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: స్టేజ్‌ - 1 ప్రిలిమినరీ పరీక్ష, స్టేజ్‌-2లో మెయిన్‌ పరీక్ష ఉంటుంది. స్టేజ్‌-3లో ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌ ఉంటుంది. తరువాత మెడికల్‌ ఎగ్జామినేషన్‌ కూడా ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్ష: రెండు ఆబ్జెక్టివ్‌ టైప్‌(మల్టిపుల్‌ చాయిస్‌) తరహా ప్రశ్న పత్రాలు ఉంటాయి. ఇవి 500 మార్కులకు ఉంటాయి. ఇందులో 200 మార్కులకు పేపర్‌-1 ఉంటుంది. దీనిని రెండు గంటల్లో పూర్తి చేయాలి. 300 మార్కులకు పేపర్‌-2 ఉంటుంది. వ్యవధి మూడు గంటలు. ఇందులో కోర్‌ ఇంజనీరింగ్‌ సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి. అలాగే నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

మెయిన్స్‌ పరీక్ష: ఇది పూర్తిగా డిస్ర్కిప్టివ్‌ పరీక్ష. ప్రిలిమ్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారిలో 1:6 లేదా 1:7 మందిని మెయిన్స్‌కు పిలుస్తారు. అంటే యావరేజీగా 2844 నుంచి 3318 మందికి మెయిన్స్‌ రాసే అవకాశం లభించవచ్చు. ఇందులో కూడా రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 300 మార్కులు. ఇవి పూర్తిగా ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన పేపర్లు. ఒక్కో పేపర్‌ వ్యవధి మూడు గంటలు.


ఇంటర్వ్యూ: చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి 200 మార్కులు కేటాయించారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనిలో అభ్యర్థుల ఆలోచించే తీరు, తెలివి తేటలు, నాయకత్వ లక్షణాలను పరిశీలిస్తారు.

చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 16

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2026 ఫిబ్రవరి 8

మెయిన్స్‌ పరీక్ష: 2025 జూన్‌ 21

వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/

ఖాళీలు 474

ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 07:34 AM