Share News

Durga Navratri 2025: నేటి అలంకారం శ్రీ మహాచండీదేవి

ABN , Publish Date - Sep 28 , 2025 | 04:44 AM

శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా...

Durga Navratri 2025: నేటి అలంకారం శ్రీ మహాచండీదేవి

దుర్గా నవరాత్రులు

నేటి అలంకారం

శ్రీ మహాచండీదేవి

ఆశ్వయుజ శుద్ధ షష్టి, ఆదివారం

శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహాచండీ అమ్మ వారు ఉద్భవించింది. శ్రీచండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీమహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టే. అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని శత్రువులు మిత్రులుగా మారతారని పెద్దలు చెప్పారు. ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

నైవేద్యం :

కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డు, రవ్వకేసరి, కట్టె పొంగలి

అలంకరించే చీర రంగు : ఎరుపు

అర్చించే పూల రంగు: ఎరుపు

పారాయణ: చెయ్యాల్సినవి:

చండీ సప్తశతి, లలితా సహస్రనామాలు, ఖడ్గమాల

ఇవి కూడా చదవండి..

చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి

ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 04:44 AM