Share News

Earth as Source of Life: భూమాతా వందనం

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:41 AM

భూమాత పట్ల మనం కనికరంగా వ్యవహరించాలి, అంగీకరించకపోతే ఆమె తమ ప్రకృతిలో పునరుద్ధరించే బలాన్ని చూపిస్తుంది సహజయోగంలో మూలాధార స్థానం, శక్తి స్థితి మరియు దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు మన శరీరంలో పరిపూర్ణ సమతుల్యతను కలిగిస్తాయి

Earth as Source of Life: భూమాతా వందనం

సహజయోగ

22న ధరిత్రీ దినోత్సవం

నకు, మనతోపాటు ఈ భూమిమీద జీవించే సమస్త ప్రాణికోటికి ఆధారం భూమి. దానిలోనుంచి ప్రాణులు ఉత్పన్నమయ్యాయి. మానవులు ఉద్భవించారు. ప్రాణులు జీవించడానికి అనుకూలమైన, ఆరోగ్యవంతమైన, సమతుల్య జీవనానికి దోహదపడే వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నీరు, చెట్లు, పండ్లు, భగవంతుణ్ణి ఆరాధించుకోవడానికి పుష్పాలు... ఇలా అన్నీ భూమిపై ఏర్పడ్డాయి. అందుకే... ఉదయం లేవగానే, మన పాదాలను నేలకు ఆన్చినప్పుడు... ‘సముద్రవసనే దేవీ, పర్వతస్థన మండలే/ విష్ణుపత్నీం నమస్తుభ్యం, పాదస్వర్శం క్షమస్వమే... ’అనే శ్లోకం ద్వారా... ‘నిన్ను నా పాదాలతో స్పృశిస్తున్నందుకు క్షమించాలి’ అని భూమాతను ప్రార్థించడాన్ని ఒక విధిగా పూర్వులు నిర్దేశించారు. కానీ మానవులు భూమాత పట్ల మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారు. తమ స్వప్రయోజనాల కోసం మితిమీరి భూమిని వినియోగించుకుంటున్నారు. తనపై విసిరేస్తున్న అనేక మాలిన్యాలను ఆమె భరిస్తోంది తనలోకి స్వీకరిస్తోంది. కానీ పరిస్థితి విషమిస్తే... ఆమె రౌద్రాకారం దాల్చుతుంది. అప్పుడు వరదల ద్వారా, భూకంపాల ద్వారా, కరువుకాటకాల ద్వారా ఏర్పడే పరిస్థితులకు మానవులు మూల్యం చెల్లించుకోవాలి. కాబట్టి ఈ విషయంలో అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి.


మూలాధార రూపంలో...

యోగ శాస్త్రపరంగా చూస్తే, మనలో... మూలాధార రూపంలో భూమాత నిక్షిప్తమై ఉంటుంది. మన సూక్ష్మ శరీరంలో వెన్నెముక చివరి భాగాన ఉండే త్రిభుజాకారపు ఎముకగా ఉండే మూలాధారంలో నిక్షిప్తమైన శక్తి కుండలినీ శక్తి. ఈ జగత్తు సృష్టి కర్త అయిన భూమాత. జీవ పరిణామ క్రమంలోని వివిధ దశలకు... భూమి మధ్యలోని అక్షం (ఇరుసు, మధ్యభాగం) కీలకపాత్ర పోషించింది. అదే విధంగా మానవుడిని గతంవైపు లేదా భవిష్యత్తువైపు అతిగా వెళ్ళకుండా... నిశ్చలమైన, నిర్దిష్టమైన సమతుల్య స్థితిలో ఉంచేది... అతనిలోని సుషుమ్నానాడి. మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైనది. మనలోని నాడీ వ్యవస్థకు ఈ ఇరుసే (అక్షం) ఆధారం. ఈ నాటి సరైన రీతిలో ఉండకపోవడం వల్ల కుడి, ఎడమలకు ఊగిసలాడుతూ ఉండేవారికి వివిధ చక్రాలలో సమస్యలు, ఇబ్బందులు ఏర్పడతాయి. మానవులలో ఈ ఇరుసు మూడున్నర వంతులు చుట్టుకున్న కాగితంలా ఉంటుంది. దానిలోపల బ్రహ్మనాడి... చాలా సన్నగా, వెంట్రుక వాసిలో ఉంటుంది. అలాంటి బ్రహ్మనాడిద్వారా... కేవలం వెంట్రుక లాంటి సన్నటి కుండలినీ పోగు మాత్రమే ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తుంది. ఇలాంటి స్థితిలో ఉన్నవారు బాహ్యపరంగా చూడడానికి గంభీరంగా, ధైర్యంగా, తెలివైనవారిగా, మంచివారిగా కనిపిస్తారు. కానీ ఆధ్యాత్మికంగా అంత లోతుగా ఉండరు.


భక్తి, శ్రద్ధలే మార్గం

ఆత్మసాక్షాత్కారం పొంది... ఆధ్యాత్మికమైన లోతులకు వెళ్ళగలిగే వ్యక్తుల్లో... బ్రహ్మనాడి విశాలమవుతుంది. దానిలో ప్రయాణించే కుండలినీ పోగులు కూడా వెడల్పుగా ఉంటాయి. అంతర్గతంగా ఆధ్యాత్మికపరమైన లోతు ఉన్న వైఖరి ఎంతో సుందరంగా, మనోహరంగా ఉంటుంది. వారు అందరినీ ఆనందంగా ఉంచగలుగుతారు. ఎప్పుడైతే చిత్తం అంతర్గతంగా వెళ్ళడం ప్రారంభిస్తుందో... అప్పుడు బ్రహ్మనాడి విస్తరించడం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికంగా లోతులకు వెళ్ళడం ప్రారంభమవుతుంది. కుండలినీ జాగృతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొంది, యోగసాధన చేస్తున్నవారు ఈ స్థితిని సాధించగలరు. కాబట్టి మన సుషుమ్నా నాడిని దృఢంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ స్థితిని సాధించాలంటే భక్తి, శ్రద్ధలే మార్గం.

(శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

-డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 12:49 AM