Share News

Coconut Husk Uses: కొబ్బరిపీచుతో కొత్తగా

ABN , Publish Date - Sep 20 , 2025 | 03:00 AM

ఒకప్పుడు కొబ్బరిపీచుతో తాళ్లు, మంచాల నులక తయారుచేసేవారు. ఇప్పుడు మాత్రం కొబ్బరికాయ కొట్టగానే దాని పీచును తీసి చెత్తబుట్టలో పడేస్తున్నాం. అలా పారేయకుండా కొబ్బరి పీచును ఎలా...

Coconut Husk Uses: కొబ్బరిపీచుతో కొత్తగా

ఒకప్పుడు కొబ్బరిపీచుతో తాళ్లు, మంచాల నులక తయారుచేసేవారు. ఇప్పుడు మాత్రం కొబ్బరికాయ కొట్టగానే దాని పీచును తీసి చెత్తబుట్టలో పడేస్తున్నాం. అలా పారేయకుండా కొబ్బరి పీచును ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం...

  • కొబ్బరి పీచుతో చర్మాన్ని చక్కగా తోముకోవచ్చు. ఈ పీచు పదునుగా ఉంటుంది కాబట్టి కాస్త మెల్లగా రుద్దితే చర్మం మీద పేరుకున్న మురికి పూర్తిగా పోతుంది. మృతకణాలు ఎక్కువగా పేరుకునే మెడ, వీపు, పాదాలను కొబ్బరి పీచుతో రుద్ది కడిగితే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. చర్మ రంధ్రాలు లోపలి వరకు శుభ్ఝ్రపడతాయి.

  • మసిబారిన గిన్నెలు, జిడ్డు పట్టిన డబ్బాలు, దేవుడి దగ్గర ఉపయోగించే కుందులు, మూకుడు తదితరాలను కొబ్బరిపీచుతో రుద్ది శుభ్రం చేయవచ్చు. పీచు మీద కొద్దిగా డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ వేసి దానితో రుద్దితే జిడ్డు, మసి లాంటివి త్వరగా వదిలిపోతాయి.

  • కొబ్బరి పీచును చిన్న ముక్కలుగా కత్తిరించి కుండీల్లోని మట్టిలో కలిపితే మొక్కలకు పూలు బాగా పూస్తాయి. అంతేకాదు మట్టి ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఈ పీచును ఎరువులా వాడితే నేలకు, మొక్కలకు పోషకాలు బాగా అందుతాయి. మొక్కల కాండాలు, ఆకుల మీద క్రిమి కీటకాలు, ఫంగ్‌సలు, ఇతర శిలీంధ్రాలు చేరవు.

  • కొబ్బరిపీచుతో పక్షి గూడు, చిలకలు, పిచ్చుకలు, ఏనుగు, ఇంటి నమూనా, డోర్‌ మ్యాట్‌ లాంటి గృహాలంకరణ వస్తువులు ఎన్నో తయారుచేయవచ్చు. ఇవి ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి.

  • కొబ్బరి పీచును చిన్న ముక్కలుగా చేసి, ఒక గిన్నెలో వేసి దానిమీద కర్పూరం బిళ్ల ఉంచి వెలిగించాలి. ఆ గిన్నెను ఇంట్లో ఓ మూలగా ఉంచితే... ఇల్లంతా మంచి సువాసన వ్యాపిస్తుంది. దోమలు, ఈగలు బయటికి వెళ్లిపోతాయి.

ఇవి కూడా చదవండి..

డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి

హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 03:00 AM