Baggy Jeans Trend Style: బ్యూటిఫుల్ బ్యాగీ
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:56 AM
బిగుతుగా ఉండే జీన్స్‌కు రోజులు చెల్లిపోయాయి. వదులుగా, సౌకర్యంగా ఉండే బ్యాగీ జీన్స్ ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. ఈ తాజా ఫ్యాషన్‌తో ఎలా ఆకట్టుకోవచ్చో తెలుసుకుందాం!...
ఫ్యాషన్
బిగుతుగా ఉండే జీన్స్‌కు రోజులు చెల్లిపోయాయి. వదులుగా, సౌకర్యంగా ఉండే బ్యాగీ జీన్స్ ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. ఈ తాజా ఫ్యాషన్‌తో ఎలా ఆకట్టుకోవచ్చో తెలుసుకుందాం!
స్టెయిట్ కట్, బూట్ కట్, రెగ్యులర్ ఫిట్... ఇలా జీన్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా బ్యాగీ జీన్స్ ట్రెండ్ వాడుకలోకొచ్చింది. వదులుగా ఉండే ఈ జీన్స్ సౌకర్యంగా కూడా ఉండడంతో వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరూ వీటిని ఆదరిస్తున్నారు. అయితే బ్యాగీ జీన్స్‌ను తగిన టాప్స్, టీషర్ట్స్, ఇతరత్రా యాక్సెసరీ్‌సను ఆచితూచి ఎంచుకోవాలి. అప్పుడే ఈ జీన్స్ అందం ఇనుమడిస్తుంది. అందుకోసం...
యాక్సెసరీస్:
పెద్ద డయల్ కలిగి ఉండే వాచీలు ఈ రకం ప్యాంట్లకు బాగా సూటవుతాయి.
అనలాగ్ వాచీలను ఎంచుకోవచ్చు.
క్రాప్‌టాప్స్:
బ్యాగీ జీన్స్‌తో కురచగా ఉండే క్రాప్ టాప్స్‌తో మ్యాచ్ చేయాలి. ఈ టాప్ బిగుతుగా లేదా వదులుగా ఉన్నా ఫరవాలేదు. స్లీవ్‌లెస్, ఫుల్ హ్యాండ్స్.. అయినా ఫరవాలేదు. కానీ వేసుకున్న ప్యాంట్‌కు నప్పేలా చూసుకోవాలి
బూట్లు:
బ్యాగీ ప్యాంట్‌కు బూట్లు, స్పోర్ట్స్ షూస్ చాలా బాగా నప్పుతాయి.
పెద్ద హీల్ ఉన్న బూట్లు, యాంకిల్ లెంగ్త్ బూట్లు ఎంచుకోవచ్చు.
ఇవి కూాడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి