Cucumber Benefits: కీరదోస ప్రయోజనాలెన్నో
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:34 AM
నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోసను సలాడ్‌ల రూపంలో ఎక్కువగా తీసుకుంటాం. ఈ కీరదోస వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు....
నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోసను సలాడ్‌ల రూపంలో ఎక్కువగా తీసుకుంటాం. ఈ కీరదోస వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆ వివరాలు తెలుసుకుందాం...
ఊబకాయ బాధితులకు కీరదోస దివ్యౌషధం లాంటిది. ఇందులో తక్కువ క్యాలరీలు ఉండడం వలన బరువు తగ్గేందుకు బాగా ఉపయోపడుతుంది.
కీరదోస మధమేహాన్ని, రక్త పోటును అదుపులో ఉంచుతుంది.
దీనిలో దాదాపు 95 శాతం నీరు ఉండడం వలన డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించకోవచ్చు.
ఇందులోని విటమిన్ ఎ, బి, సిలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కీరదోస శరీరాన్ని నిర్వీషికరణ చేస్తుంది.
కిడ్నీలో రాళ్లను కరిగించడంలో ఉపయోగపడుతుంది.
శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంచుతుంది.
ఇందులోని విటమిన్ బి అడ్రినల్ గ్రంథి పనితీరును మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అలాగే కీర ముక్కలను రోజూ కళ్ల మీద పెట్టుకుంటే కళ్ల మంట, నల్లటి వలయాలు తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి