Zubeen Garg Case Mystery: విషమిచ్చి చంపారు.. సింగర్ జుబీన్ మృతి కేసులో అనూహ్య ట్విస్ట్
ABN , Publish Date - Oct 04 , 2025 | 10:26 AM
ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసు షాకింగ్ టర్న్ తీసుకుంది. అతని భార్య చెప్పినట్టు జుబీన్ గార్గ్ ది సహజ మరణం కాదని తేలింది. జుబీన్ గార్గ్‌ను బలవంతంగా ఈతకు తీసుకెళ్లి అతని మేనేజర్ సిద్ధార్థ శర్మనే విషమిచ్చి చంపినట్లు..
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసు షాకింగ్ టర్న్ తీసుకుంది. అతని భార్య చెప్పినట్టు జుబీన్ గార్గ్ ది సహజ మరణం కాదని తేలింది. జుబీన్ గార్గ్‌ను బలవంతంగా ఈతకు తీసుకెళ్లిన అతని మేనేజర్ సిద్ధార్థ శర్మ.. కావాలనే కుట్ర చేసి విషమిచ్చి చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జుబీన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా వైద్యం అందించకుండా అతని మేనేజర్ నిర్లక్ష్యం చేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పడంతో ఈ కేసు మరో టర్న్ తీసుకుంది. దీంతో ఈ కేసును విచారించడానికి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు అస్సాం సీఎం ప్రకటించారు.
తన కుట్రను కప్పిపుచ్చడానికి సిద్ధార్థ శర్మ విదేశీ మద్యాన్ని కూడా ఏర్పాటు చేశాడని మృతి కేసు విచారణ నివేదికలు సూచిస్తున్నాయి. సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ.. సెప్టెంబర్ 19న జుబీన్ గార్గ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే. అస్సాం ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక విజిలెన్స్ సెల్ తయారు చేసిన రిమాండ్ నోట్‌లో.. సిద్ధార్థ శర్మ కుట్ర కోణం బయటపడింది. దీంతో పోలీస్ ఎఫ్‌ఐఆర్‌లో శర్మపై నేరపూరిత కుట్ర, హత్య, హత్యానేరం వంటి తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు చేశారు.
మరోవైపు, జుబీన్ మృతి కేసులో ప్రత్యక్ష సాక్షి, జుబీన్ కార్గ్ బేండ్ మెంబర్ అయిన శేఖర్ జ్యోతి గోస్వామి ప్రత్యేక విజిలెన్స్ సెల్‌కు ఇచ్చిన సాక్ష్యం సంచలనంగా మారింది. మరణానికి ముందు.. శర్మ బలవంతంగా జుబీన్ గార్గ్ నుంచి పడవ నియంత్రణను తీసుకున్నాడని.. ఆ మరణాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించడానికి సిద్ధార్థ శర్మ కుట్ర పన్నాడని గోస్వామి తెలిపారు. సిద్ధార్థ శర్మ, అతని సహచరుడు శ్యామకాను మహంత ఉద్దేశపూర్వకంగానే జుబీన్‌కు విషమిచ్చి చంపారని తెలిపాడు. ఆ కుట్రను దాచడానికి విదేశీ మద్యాన్ని ఏర్పాటు చేశారని గోస్వామి ఆరోపించారు. జుబీన్ గార్గ్ శిక్షణ పొందిన ఈతగాడని కూడా ఆయన గుర్తు చేశారు. కావున ఈత కారణంగా జుబీన్ మరణించే అవకాశం లేదని గోస్వామి స్పష్టం చేశారు.
అంతేకాదు, గార్గ్ తన చివరి క్షణాల్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో.. శర్మ అతని పరిస్థితిని 'యాసిడ్ రిఫ్లక్స్'గా కొట్టిపారేస్తూ.. జాబో దే, జాబో దే(అతన్ని వెళ్లనివ్వండి, వెళ్లనివ్వండి) అని అరిచాడని కూడా సాక్షులు వెల్లడించారు. ఆ సమయంలో శర్మ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని.. ఈ కుట్రను దాచి పెట్టడానికి ఉద్దేశపూర్వకంగానే మేనేజర్ సింగపూర్‌ను ఎంచుకున్నారని.. అలాగే పడవ వీడియోలను ఎవరికీ షేర్ చేయవద్దని శర్మ తనకు సూచించాడని గోస్వామి కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ సెల్‌కు తెలిపారు.
కాగా, జుబీన్ మృతి పట్ల దేశం యావత్తూ నిర్ఘాంతపోయింది. దేశం నలుమూలల నుంచి జుబీన్ సంగీత అభిమానులు సంతాప సందేశాలు, ఘన నివాళులు అర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది
పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Read Latest Telangana News and National News