Share News

Viral Video: మెట్రోలో గందరగోళం.. గేట్లు దూకిన మహిళలు

ABN , Publish Date - Jun 07 , 2025 | 05:15 PM

అభిమానం, అభిమానం. ఇది మనుషులని ఉత్సాహపరుస్తుంది, ఉర్రూతలూగిస్తుంది. కానీ, ఇదే పరిధి దాటితే మాత్రం విషాదంగా మారుతుందని చెప్పవచ్చు. అవును ఇది ముమ్మాటికి నిజం. గతంలో హీరో అల్లు అర్జున్ సినిమా విషయంలో జరిగిన ఘటన..ఇప్పుడు బెంగళూరులో జరిగింది. అందుకు సంబంధించిన ఓ వీడియో (Viral video) నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: మెట్రోలో గందరగోళం.. గేట్లు దూకిన మహిళలు
Viral video Bengaluru Metro

అభిమానం, ఎమోషన్స్ వీటిలో దేనికైనా ఓ పరిధి ఉండాలని, అతిగా ఉంటే ముప్పేనని నిపుణులు చెబుతున్నారు. క్రీడాకారులు, హీరోలు సహా ఎవరి విషయంలోనైనా పిచ్చిగా అభిమానం పెంచుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే, నష్టమే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇదంతా ఇప్పుడెందుకంటే బెంగళూరు (Bengaluru)లో జూన్ 4, 2025న జరిగిన RCB ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియానికి అభిమానంతో భారీగా వెళ్లిన జనాలతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 33 మందికి పైగా గాయపడ్డారు.


లక్షలాది మంది

ఈ విజయోత్సవాల సమయంలో బెంగళూరు మెట్రో స్టేషన్లు ముఖ్యంగా కబ్బన్ పార్క్, ఎస్‌వీ రోడ్, ఇందిరానగర్, హలసూరు, ట్రినిటీ వంటి స్టేషన్లు అభిమానులతో కిటకిటలాడాయి. లక్షలాది మంది అభిమానులు స్టేడియంకు చేరుకోవడానికి, స్టేడియం నుంచి బయటకు వెళ్లడానికి మెట్రోను ఉపయోగించారు. ఆ సమయంలో, కొందరు అభిమానులు టోకెన్లు లేకుండా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా మెట్రో గేట్లను దూకడం, టర్న్‌స్టైల్స్‌ను దాటడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నాయి.


గేట్లు దూకిన మహిళలు..

వీడియోలో పురుషులతోపాటు మహిళలు కూడా గేట్లను దూకి వెళ్లడం కనిపిస్తుంది. భారీగా వచ్చిన అభిమానుల వల్ల మెట్రో స్టేషన్లలో సిబ్బందికి సైతం ఏం చేయాలో అర్థం కాలేదు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) అధికారులు ఓవర్‌ క్రౌడెడ్ రైళ్లలో ఎక్కవద్దని పదేపదే ప్రకటనలు చేసినప్పటికీ వారు మాత్రం పట్టించుకోలేదు. ఆగకుండా గేట్లను దూకడంతోపాటు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితి కారణంగా కొందరు అభిమానులు గాయపడ్డారు. మరికొందరు కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించారు.


ఎందుకు ఇలా జరిగింది?

ఈ విషాద ఘటనకు అభిమానుల గందరగోళమే కారణమని పలువురు చెబుతుండగా, మరికొంత మంది మాత్రం ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమని ఆరోపిస్తున్నారు. ఇంకొందరు మాత్రం దీనిని ఆర్సీబీ జట్టు ఆటగాళ్లకు లింక్ చేసి సోషల్ మీడియాలో అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. స్టేడియం సామర్థ్యం కంటే అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో గేట్ల వద్ద తొక్కిసలాట జరిగింది. జన సమూహం భారీగా ఉండటంతో పోలీసులు సైతం నియంత్రించలేకపోయారు. ఆ క్రమంలో మెట్రోలను ఉపయోగించడంతో స్టేషన్లలో తగిన సిబ్బంది, భద్రతా చర్యలు లేకపోవడం వల్ల గందరగోళం మరింత పెరిగిందని ఇంకొంత మంది అంటున్నారు. అభిమానులు మెట్రో గేట్లను దూకడం, టికెట్ లేకుండా ప్రవేశించడం వంటి చర్యలు కూడా పరిస్థితిని మరింత దిగజార్చాయని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..


ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2025 | 05:30 PM