Karwa Chauth Tragedy: పండుగ ముందు తీవ్ర విషాదం.. భర్త కళ్ల ఎదుటే ముక్కలైన భార్య..
ABN , Publish Date - Oct 11 , 2025 | 10:42 AM
అనురాధ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. పోస్టుమార్టం తర్వాత అనురాధ బాడీని అతికించి కాకుండా ముక్కలుగానే ఇవ్వటంతో కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
కార్వా చౌత్ పండుగకు ఒక రోజు ముందు అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ భార్య భర్త కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు ప్రమాదంలో ఆమె శరీరం ముక్కలు ముక్కలు అయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హపుర్ జిల్లాలోని భాతియానాకు చెందిన అనురాధ, హరిఓమ్ భార్యాభర్తలు. గురువారం కార్వా చౌత్ పండుగ ఉండటంతో ఇద్దరూ కలిసి బైకుపై షాపింగ్‌కు వెళ్లారు.
బైకు గులౌతీ మార్కెట్ దగ్గరకు రాగానే ఓ ట్రక్కును ఢీకొట్టింది. భార్యాభర్తలు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ట్రక్ అనురాధ మీదుగా దూసుకుపోయింది. దీంతో ఆమె శరీరం ముక్కలు ముక్కలు అయింది. గుండె ఎగిరి దూరంగా పడి కొట్టుకోసాగింది. ఆ దృశ్యాలు చూసి భర్త గుండె ఆగినంత పనైంది. భార్యను ఆ స్థితిలో చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు. అతడి కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆ గాయాల నొప్పిని సైతం మర్చిపోయి భార్య దేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించాడు
ప్రమాదాన్ని కళ్లారా చూసినవాళ్లు సైతం బిక్కచచ్చిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హరిఓమ్‌ను ఆస్పత్రికి తరలించారు. అనురాధ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. పోస్టుమార్టం తర్వాత అనురాధ బాడీని అతికించి కాకుండా ముక్కలుగానే ఇవ్వటంతో కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇక, మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రక్ డ్రైవర్ కోసం అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పండుగ రోజు రెచ్చిపోయిన మహిళలు.. హుక్కా తాగుతూ..
ఈ కలర్ మొలతాడు కడితే.. మీకు తిరుగులేనట్లే..