Rajasthan Murder: ప్రియుడిని వెతుక్కుంటూ 600 కి మీ వెళ్లి
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:30 AM
కారును నడుపుకొంటూ 600 కి.మీ దూ రంలో ఉన్న ప్రియుడి వద్దకు వెళ్లిన ఆ మహిళ, అతడి చేతిలోనే దారుణహత్యకు గురైంది. రాజస్థాన్‌లోని బర్మార్‌లో ఈ ఘటన జరిగింది. హతురాలు...
అతడి చేతిలోనే దారుణహత్యకు గురైన మహిళ
జైపూర్, సెప్టెంబరు 15: కారును నడుపుకొంటూ 600 కి.మీ దూ రంలో ఉన్న ప్రియుడి వద్దకు వెళ్లిన ఆ మహిళ, అతడి చేతిలోనే దారుణహత్యకు గురైంది. రాజస్థాన్‌లోని బర్మార్‌లో ఈ ఘటన జరిగింది. హతురాలు ఝున్‌ఝునుకు చెందిన 37 ఏళ్ల అంగన్‌వాడీ సూ పర్‌వైజర్ ముకేశ్ కుమారి. ఆమె వివాహిత. భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. బర్మార్‌కు చెందిన మనరామ్ అనే ఉపాధ్యాయుడితో ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. మనరామ్‌కు పెళ్లయింది. భార్యతో మనస్పర్థలు రావడంతో విడాకుల కేసు కో ర్టులో ఉంది. ముకేశ్ కుమారి-మనరామ్ మధ్య పరిచయం, కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్లుగా మనరామ్‌పై కుమారి ఒత్తిడి చేస్తోంది. సెప్టెంబరు 10న మనరామ్‌ను కలిసేందుకు ఝున్‌ఝును నుంచి కారులో బర్మార్‌కు బయలుదేరింది. నేరుగా అతడి ఇంటికి వెళ్లి.. మనరామ్ కుటుంబసభ్యులతో తన ప్రేమ విషయం చెప్పింది. అదేరోజు సాయంత్రం కుమారి-మనరామ్ కలిసి కారులో బయటకు వెళ్లారు. మార్గమధ్యలో మనరామ్ ఐరన్ రాడ్డుతో తల మీద కొట్టి కుమారిని చంపాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News