Devanahalli Affair: ఎఫైర్‌కు నో చెప్పాడని యువకుడిపై మహిళ దారుణం
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:10 PM
ఎఫైర్‌కు బ్రేకప్ చెప్పాడనే పగతో ప్రియుడిపై దాడి చేయించింది ఓ మహిళ. ఈ దాడిలో ప్రియుడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన బెంగళూరు రూరల్ జిల్లా, దొడ్డబళ్లాపుర తాలూకాలో చోటుచేసుకుంది.
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల కారణంగా చోటుచేసుకునే దారుణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. నిత్యం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎక్కడో ఓ చోట వివాహేతర సంబంధం కారణంగా ఎవరో ఒకరు బలి అవుతూనే ఉన్నారు. తాజాగా, కర్ణాటకలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఎఫైర్‌కు బ్రేకప్ చెప్పాడనే పగతో ప్రియుడిపై దాడి చేయించింది ఓ మహిళ. ఈ దాడిలో ప్రియుడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు రూరల్ జిల్లా, దొడ్డబళ్లాపుర తాలూకా పుట్టయ్యన్న అగ్రహారానికి చెందిన కార్తీక్ అదే ప్రాంతానికి చెందిన దీప అనే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు.
కొన్ని నెలల పాటు వీరి ఎఫైర్ బాగానే నడిచింది. తర్వాతి నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి . కార్తీక్ ఇంట్లో వారికి ఈ విషయం తెలిసి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీపకు దూరంగా ఉండాలని మాట తీసుకున్నారు. కుటుంబసభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం అతడు దీపకు దూరంగా ఉండటం మొదలెట్టాడు. కార్తీక్ దూరంగా ఉండటం దీపకు నచ్చలేదు. అతడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో పగ పెంచుకుంది. తన గ్యాంగ్ సాయంతో అతడిపై దాడి చేయడానికి ప్లాన్ సిద్ధం చేసింది. ప్లాన్ ప్రకారం డిసెంబర్ 13వ తేదీన దీపతో పాటు ఆమె గ్యాంగ్ సభ్యులు కార్తీక్ పని చేస్తున్న షాప్ దగ్గరకు వచ్చారు.
వచ్చీరాగానే కార్తీక్‌పై దాడి చేయటం మొదలెట్టారు. దీప కారులో కూర్చుని ఇదంతా చూడసాగింది. దీప గ్యాంగ్ సభ్యులు కార్తీక్‌పై విచక్షణా రహితంగా దాడి చేయటం మొదలెట్టారు. స్థానికులు దీప గ్యాంప్‌పై తిరగబడ్డారు. దీంతో భయపడిపోయిన దీప గ్యాంగ్ అక్కడినుంచి పారిపోయింది. ఇక, గాయపడ్డ కార్తీక్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీపతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు.. 600 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్..
గూగుల్ హెల్త్ ట్రెండ్స్.. లక్షల మంది సెర్చ్ చేసిన వ్యాధులు ఇవే..