Share News

Of Rains And Votes: ఈ టైమ్‌లో.. ఎన్నికలు ఎందుకు నిర్వహించరో తెలుసా?

ABN , Publish Date - Aug 20 , 2025 | 08:02 AM

ఎన్నికలు.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగినా.. వీటిని నిర్వహించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఏముంది కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదల చేసింది.

Of Rains And Votes: ఈ టైమ్‌లో.. ఎన్నికలు ఎందుకు నిర్వహించరో తెలుసా?
Of rains and votes

ఎన్నికలు.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగినా.. వీటిని నిర్వహించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఏముంది కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదల చేసింది. పోలింగ్‌కు ముందు ఏర్పాట్లు.. ఆ తర్వాత ఈవీఎంలు లేదా బ్యాలెట్ బాక్స్‌లు తరలింపు.. వాటి భద్రత.. అలాగే ఓట్ల లెక్కింపు.. విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు ప్రకటన.. ఇలా ఇంత తతంగం ఉంటుంది. వీటిని నిర్వహించడం వెనుక కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. అంటే ఇది అంతా ఆషామాషీ వ్యవహారం కాదన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వర్షాకాలంలో ఎన్నికలు నిర్వహించారన్న విషయం తెలుసా?. ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు. ఎందుకంటే.. భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండవచ్చు.


వర్షాకాలంలో ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ.. భారీగా వర్షాలు పడుతుంటాయి. దీంతో నదులు పొంగి ప్రవహిస్తాయి. అలాగే తరచూ వరదలు వస్తాయి. కొండచరియలు విరిగి పడతాయి. వీటి కారణంగా.. రహదారులు పూర్తిగా ధ్వంసమవుతాయి. దీంతో ఎన్నికల సామాగ్రిని మారుమూల ప్రాంతాలకు తరలించడం క్లిష్టంగా మారుతోంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు చాలా వరకు వరద ముంపునకు గురయ్యే అవకాశముంది. దీంతో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయడం చాలా కష్టంగా మారుతోంది.


భారీ వర్షాలు, వరదల కారణంగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సైతం ఇళ్లు వదిలి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో స్వల్ప ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ఎన్నికల ఫలితాల చట్టబద్ధతను ఘోరంగా దెబ్బ తీస్తోందనే అభిప్రాయం ఉంది.


ఇక భారీ వర్షాలు.. భద్రతా కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తాయి. వరదలు సంభవించే ప్రాంతాల్లో ఎన్నికల బూత్‌లను పర్యవేక్షించడం. గస్తీ నిర్వహించడం కష్టమవుతోంది. ఇది ఎన్నికల అధికారులకు పెద్ద సవాల్‌గా మారవచ్చు.


ఒక వేళ.. వర్షా కాలంలో ఎన్నిక నిర్వహణ కోసం తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి.. అందులో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినా.. ఆ సౌకర్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల పోలింగ్‌కు అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి.


ఇక ఈ కాలంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఎన్నికల అధికారులకు, పోలింగ్ కేంద్రాల్లోని అధికారుల మధ్య ఎప్పటికప్పుడు సమాచారం అందే పరిస్థితి ఉండదు. దీంతో వారి మధ్య సమన్వయం లోపిస్తుంది.


వర్షాకాలంలో.. అంటు వ్యాధులు ప్రబలుతాయి. అవి కూడా నీటి ద్వారానే వ్యాపిస్తాయి. దాంతో పోలింగ్ నిర్వహించే మారుమూల ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు ఉండవు. దీంతో గ్రామస్తులే కాక.. విధులు నిర్వహించేందుకు వచ్చే ఎన్నికిల సిబ్బంది సైతం తీవ్ర అనారోగ్యానికి గరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


మరోవైపు.. చాలా దేశాల్లో వర్షాకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అంతగా ఆసక్తి చూపవు. అందుకు ఆ యా దేశాల్లోని యంత్రాంగం ఇవే విషయాలు స్పష్టం చేస్తాయి. అందుకే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా.. వాతావరణం అనుకూలించే సమయంలోనే చేపడతారు.


మరి ముఖ్యంగా వర్షా కాలంలో ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు.. ప్రచారంలో పాల్గొంటారు. అందులోభాగంగా ర్యాలీలు, సమావేశాలను వారు నిర్వహిస్తారు. అదే వర్షాకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే.. నాయకులే కాదు.. ప్రజలు సైతం తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని వర్షా కాలంలో కాకుండా.. కేంద్ర ఎన్నికల సంఘం అన్నిఏర్పాట్ల మధ్య ఎన్నికలను నిర్వహిస్తోంది.

Updated Date - Aug 20 , 2025 | 08:02 AM