Share News

Justice Chandru: సీఎం స్టాలిన్‌ను నాన్నా అని పిలిస్తే తప్పేంటి..

ABN , Publish Date - Mar 08 , 2025 | 01:22 PM

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‏ను అప్పా(నాన్న) అని పిలిస్తే తప్పు ఏంటని ఆయన ప్రశ్నించారు. స్టాలిన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కొంతమంది చిన్నారులు నాన్నా అంటూ పలిచారని, ఇలా పిలిస్తే తప్పు ఏంటని ఆయన అన్నపారు.

Justice Chandru: సీఎం స్టాలిన్‌ను నాన్నా అని పిలిస్తే తప్పేంటి..

- జస్టిస్‌ చంద్రూ

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)ను విద్యార్థినీ, విద్యార్థులు ‘అప్పా’ (నాన్నా) అని పిలిస్తే తప్పేమిటని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ(Justice Chandru) ప్రశ్నించారు. నగరంలో స్టాలిన్‌ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఐదో తరగతి చదువుతున్న పిల్లలకు ఉదయం అల్పాహార పథకం అమలు చేయాలని గతంలో తాను పలువురు ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశానని, వారంతా నిధుల కొరతనీ, ఒకే వేళ నిధులు కేటాయించినా సమర్థవంతంగా అమలు చేయడం చాలా కష్టమని ఏవేవో సాకులు చెబుతూ తన మాట పట్టించుకోలేదన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Dy CM: డిప్యూటీ సీఎం ఆగ్రహం.. భాష గురించి అడిగితే ఈడీతో దాడులా..


ఈ పరిస్థితుల్లో బడిపిల్లలకు ఉదయం అల్పాహార పథకాన్ని స్టాలిన్‌ సమర్థవంతంగా అమలు చేసి పలువర్గాల ప్రశంసలందుకున్నారని చెప్పారు. ఉదయం అల్పాహారంతో తమ ఆకలి తీర్చుతున్నందుకు బడిపిల్లలు, తమ ఉన్నతచదువులకు ప్రతినెలా తమ బ్యాంక్‌ ఖాతాలలో నగదు జమ చేస్తున్నందుకు కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)ను నాన్నా అని పిలవటం సమంజసమేనని జస్టిస్‌ చంద్రూ అన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Dy CM: డిప్యూటీ సీఎం ఆగ్రహం.. భాష గురించి అడిగితే ఈడీతో దాడులా..


nani2..2.jpg

కొంతమంది నేతలకు నాన్నా అనే పిలుపు వింటేనే మండిపడుతున్నారని, ఇలాంటి నేతలు స్టాలిన్‌ను ఏ విధంగా సంబోధించినా ఫరవాలేదని అయితే భావిభారత పౌరులైన విద్యార్థులు తమకు నచ్చిన విధంగా సంబోధించడాన్ని ఎవరూ అడ్డుకోకూడదన్నారు.


ఈ వార్తను కూడా చదవండి:

తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2025 | 01:22 PM