Tamilisai Soundararajan: ఓటరు జాబితా సంస్కరణలు అవసరం..
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:06 AM
రాష్ట్రంలో కూడా ఓటరు జాబితా సంస్కరణ చేపట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందర్‌రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోయంబత్తూర్‌లో శుక్రవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మార్గదర్శకాలతో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీని తగ్గించి, ఆర్ధిక విప్లవాన్ని అమలుచేశారన్నారు.
- మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్
చెన్నై: రాష్ట్రంలో కూడా ఓటరు జాబితా సంస్కరణ చేపట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందర్‌రాజన్(Tamilisai Soundararajan:) అభిప్రాయం వ్యక్తం చేశారు. కోయంబత్తూర్‌లో శుక్రవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మార్గదర్శకాలతో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmalaseetaraman) జీఎస్టీని తగ్గించి, ఆర్ధిక విప్లవాన్ని అమలుచేశారన్నారు. జీఎస్టీ తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు కూడా తెలుపలేదన్నారు.

నటుడు విజయ్ బీజేపీ కోసం విమర్శించడం తగ్గించి, డీఎంకేను వ్యతిరేకించడంలో తీవ్రం చేయాలని సూచించారు. అమిత్ షాను కలుసుకుని బయటకు వచ్చిన సమయంలో, ఖర్చీ్‌ఫతో ముఖం తుడుచుకున్నట్లు పళనిస్వామి చెబుతున్నా, ఆ విషయమై రాజకీయ లబ్ది కోసం రాద్ధాంతాలు చేయడం తగదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News