Share News

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పు

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:58 AM

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఆందోళన కారులు బుధవారం రాత్రి మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి, బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజిబుర్‌ రెహమన్‌(బంగబంఽధు) చారిత్రక ఇంటికి నిప్పు అంటించారు.

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఆందోళన కారులు బుధవారం రాత్రి మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి, బంగ్లాదేశ్‌ వ్యవస్థాపకుడు షేక్‌ ముజిబుర్‌ రెహమన్‌(బంగబంఽధు) చారిత్రక ఇంటికి నిప్పు అంటించారు. బంగ్లాదేశ్‌ స్వాత్రంత్య పోరాటానికి చిహ్నమైన ఆ ఇంటి ని హసీనా.. మ్యూజియంగా మార్చారు. హసీనా దివంగత భర్త నివాసాన్ని, మరికొందరు అవామీ లీగ్‌ నాయకుల ఇళ్లను కూడా నిరసనకారులు తగలబెట్టారు.


బంగ్లాదేశ్‌లో యూనస్‌ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని భారత్‌లో తలదాచుకుంటున్న షేక్‌ హసీనా అవామీ లీగ్‌ మద్దతుదారులకు బుధవారం రాత్రి సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తూ ప్రసంగిస్తున్న సమయంలోనే హింస చెలరేగింది. విధ్వంసం ఘటనపై హసీనా స్పందిస్తూ.. ‘‘నాకు, నా సోదరికి ఉన్న ఒక్కగానొక్క జ్ఞాపకాన్ని నాశనం చేశారు. వారు భవనాన్ని కూల్చివేయవచ్చు. కానీ చరిత్రను చెరిపేయలేరు. ఆ చరిత్ర పగ తీర్చుకుంటుందని వారు గుర్తుంచుకోవాలి’’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 04:58 AM