Share News

Vijay home security: విజయ్ ఇంటికి భారీ భద్రత.. జనాగ్రహం నేపథ్యంలో కీలక నిర్ణయం..

ABN , Publish Date - Sep 28 , 2025 | 10:58 AM

తమిళ సూపర్‌స్టార్, తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షో భారీ విషాదానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో 39 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.

Vijay home security: విజయ్ ఇంటికి భారీ భద్రత.. జనాగ్రహం నేపథ్యంలో కీలక నిర్ణయం..
Vijay home security

తమిళ సూపర్‌స్టార్, తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షో భారీ విషాదానికి కారణమైన సంగతి తెలిసిందే (Vijay rally backlash). ఈ తొక్కిసలాటలో 39 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను పెంచినట్లు తమిళనాడు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొక్కిసలాట మరణాల తర్వాత విజయ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ర్యాలీలో మార్గదర్శకాలను విజయ్ ఉల్లంఘించారని పలువురు ఆరోపిస్తున్నారు (Public anger Vijay).


నిర్వాహకులు తాగునీరు, ఆహారం కోసం సరైన ఏర్పాట్లు చేయలేదని, అందువల్ల ప్రజలు నీరసించిపోయారని విమర్శిస్తున్నారు. విజయ్ దాదాపు 7 గంటలు ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్నారని, అతడిని చూసేందుకు ఇరుకుగా ఉన్న ప్రదేశంలోకి వేల మంది చేరుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. విజయ్ మాట్లాడుతున్న సమయంలో కూడా కొంతమంది కుప్పకూలిపోయారని, కానీ విజయ్ ప్రసంగం కొనసాగిందని, అంబులెన్స్‌లను వేదికలోకి అనుమతించలేదని వర్గాలు తెలిపాయి (crowd control).


ఇన్ని మరణాలు సంభవించడానికి కారకుడైన విజయ్‌పై జనాగ్రహం కలగవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే విజయ్ ఇంటి దగ్గర భద్రతను పెంచారు (Chennai news). కాగా, ఈ ఘటన కారణంగా విజయ్‌పై కూడా కేసులు నమోదయ్యాయి. కాగా, 2026 ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వారంలో శని, ఆది వారాల్లో ర్యాలీల్లో పాల్గొంటున్నారు.


ఇవి కూడా చదవండి..

'ఐ లవ్ మహమ్మద్‌' నిరసనలు హింసాత్మకం.. తౌకీర్ రజా ఖాన్ అరెస్టు

వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు.. లద్దాఖ్ హింసపై డీజీపీ ప్రకటన

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 10:58 AM