Share News

Vijay Mallya Lalit Modi London: భారత్ నుంచి పారిపోయిన పెద్ద వ్యక్తులం.. విజయ్ మాల్యా, లలిత్ మోదీ సెటైర్లు..

ABN , Publish Date - Dec 23 , 2025 | 07:02 PM

విజయ్ మాల్యా, లలిత్ మోదీ కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ మాల్యా 70వ పుట్టిన రోజు సందర్భంగా లలిత్ మోదీ తన నివాసంలో ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Vijay Mallya Lalit Modi London: భారత్ నుంచి పారిపోయిన పెద్ద వ్యక్తులం.. విజయ్ మాల్యా, లలిత్ మోదీ సెటైర్లు..
Lalit Modi London party

భారత్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొని దేశం నుంచి పారిపోయి లండన్‌లో తల దాచుకుంటున్న వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, లలిత్ మోదీ కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ మాల్యా 70వ పుట్టిన రోజు సందర్భంగా లలిత్ మోదీ తన నివాసంలో ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు (fugitives partying abroad).


ఈ పార్టీలో భారత్ మీద సెటైర్లు వేస్తూ తాను మాట్లాడిన వీడియోను లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో లలిత్ మోదీ తనను, విజయ్ మాల్యాను భారత్ నుంచి పారిపోయిన అతి పెద్ద వ్యక్తులుగా పరిచయం చేసుకున్నారు. 'భారతదేశంలో మళ్ళీ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేద్దాం. మీ హృదయం అసూయతో నిండిపోయేలా ఒకటి ఇస్తున్నా మీడియా ఫ్రెండ్స్. పుట్టినరోజు శుభాకాంక్షలు మై ఫ్రెండ్ విజయ్ మాల్యా. లవ్ యు' అంటూ లలిత్ మోదీ పేర్కొన్నారు (joke on India controversy).


లలిత్ మోదీ వ్యాఖ్యలు భారత్‌పై వేసిన సెటైర్లుగా చాలా మంది పరిగణిస్తున్నారు (Lalit Modi London party). లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఇద్దరినీ స్వదేశానికి తీసుకురావడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వాన్ని ఈ పోస్ట్ ఎగతాళి చేస్తున్నట్లు ఉంది. లలిత్ మోదీ పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ సంపదను దోచుకుని ఆర్థిక నేరాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

దీపూదాస్‌ను అన్యాయంగా చంపేశారు.. ఆడియో సందేశంలో షేక్ హసీనా

మూకదాడి ఘటనపై నిరసన.. ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 23 , 2025 | 07:07 PM