Share News

Chennai News: వార్షికోత్సవాలకు ముస్తాబైన వేలాంకన్ని మేరీమాత క్షేత్రం

ABN , Publish Date - Aug 29 , 2025 | 10:29 AM

నాగపట్నం జిల్లా వేలాంకన్ని ప్రాంతంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెయింట్‌ మేరీమాత క్షేత్రంలో 10 రోజుల పాటు నిర్వహించనున్న వార్షికోత్సవాలు శుక్రవారం పతాకావిష్కరణలతో ప్రారంభంకానున్నాయి. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఈ ఆలయంలో ప్రతిఏటా జరుపుకునే ఉత్సవాల్లో దేశ, విదేశాల నుండి భక్తులు, పర్యాటకులు పెద్దసంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీ.

Chennai News: వార్షికోత్సవాలకు ముస్తాబైన వేలాంకన్ని మేరీమాత క్షేత్రం

చెన్నై: నాగపట్నం(Nagapatnam) జిల్లా వేలాంకన్ని ప్రాంతంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సెయింట్‌ మేరీమాత క్షేత్రంలో 10 రోజుల పాటు నిర్వహించనున్న వార్షికోత్సవాలు శుక్రవారం పతాకావిష్కరణలతో ప్రారంభంకానున్నాయి. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఈ ఆలయంలో ప్రతిఏటా జరుపుకునే ఉత్సవాల్లో దేశ, విదేశాల నుండి భక్తులు, పర్యాటకులు పెద్దసంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీ. ఈ ఏడాది ఉత్సవాలను శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తంజావూరు జిల్లా బిషప్‌ సహాయరాజ్‌ ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభంపై మేరీమాత స్వరూపంతో రూపొందించిన పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభిస్తారు.


ఉత్సవాల రోజుల్లో ఆలయంలో తమిళం, తెలుగు, ఆంగ్లం, హిందీ, మళయాళం, కన్నడం, కొంకిణి, ఒరియా, మరాఠి తదితర భాషల్లో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఆరోగ్యమాత రథోత్సవం సెప్టెంబర్‌ 7వ తేదీ రాత్రి 7 గంటలకు జరుగుతుంది. మరుసటి రోజు అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం 6 గంటలకు నిర్వహించనున్న పట్టాభిషేకంలో క్యాథిలిక్‌ చర్చీల ఫాదర్లు పాల్గొని ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇదిలా వుండగా, వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాలనుండి వేలాది మంది భక్తులు వేలాంకన్నికి తరలివెళుతున్నారు. నాగపట్నం ఎస్పీ సెల్వకుమార్‌ నేతృత్వంలో పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు.


nani3.2.jpg

ఈ క్షేత్రంలో పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసిన 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. ఆలయం తరుఫున భక్తులు విశ్రాంతి పొందేందుకు అక్కడక్కడ పందిళ్లు ఏర్పాటయ్యాయి. గురువారానికే పెద్దసంఖ్యలో తరలివెళ్లిన భక్తులతో వేలాంకన్ని ప్రాంతం కిటకిటలాడుతోంది. ఆ ప్రాంతంలో ఉన్న సముద్రంలో దిగి భక్తులు స్నానమాచరించకుండా నిషేధం విధించిన పోలీసులు సముద్రతీరంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాంకన్నికి స్టేట్‌ ఎక్స్‌పోర్టు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ ప్రత్యేక బస్సులు, దక్షిణరైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..

4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 29 , 2025 | 10:29 AM