Share News

Vande Bharat Trial Run: చినాబ్ రైల్వే వంతెనపై వందేభారత్ ట్రయల్ రన్!

ABN , Publish Date - Jan 25 , 2025 | 10:25 PM

జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రైలు సర్వీసు అందుబాటులోకి తెచ్చే దిశగా భారతీయ రైల్వే మరో మైలురాయిని అధిగమించింది. చినాబ్ వంతెనపై వందే భారత్ ట్రయల్ రన్ దిగ్విజయంగా పూర్తి చేసింది.

Vande Bharat Trial Run:  చినాబ్ రైల్వే వంతెనపై వందేభారత్ ట్రయల్ రన్!

ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్‌కు పూర్తిస్థాయిలో రైలు సర్వీసులు అందుబాటులోకి తెచ్చే క్రమంలో క్రమంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా పేరు పడ్డ చినాబ్ బ్రిడ్జిపై వందేభారత్ తొలిసారిగా పరుగులు పెట్టింది. పూర్తి స్థాయి సర్వీసు ప్రారంభించేముందు రైల్వే శాఖ వందే భారత్‌లో ఈ ట్రయల్ రన్ నిర్వహించింది.

Draupadi Murmu: ప్రగతి దిశగా భారత్ పయనం.. రాష్ట్రపతి రిపబ్లిక్ డే ప్రసంగం

శ్రీ మాతా వైష్ణో దేవీ ఖత్రా స్టేషన్ ‌నుంచి బయలుదేరిన వందే భారత్ చీనాబ్ వంతెన, అంజీ ఖండ్ బ్రిడ్జి మీదుగా శ్రీనగర్‌కు చేరింది. ఇక జమ్ములో రైలు కాసేపు ఆగిన తరుణంలో జనాలు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు వచ్చి చప్పట్లు చరుస్తూ ఈలలు వేస్తూ స్వాగతం పలికారు. చివరగా బుద్గామ్ స్టేషన్‌కు రైలు చేరడంతో ట్రయల్ రన్ దిగ్విజయంగా ముగిసింది. త్వరలో వాణిజ్య రైలు సర్వీసు కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఖత్రా నుంచి ఈ రైలును ప్రారంభిస్తారని సమాచారం. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.


Padma Awards 2025: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

ఇక మేడిన్ ఇండియా విధానం విజయానికి ప్రతీకగా నిలుస్తున్న వందేభారత్ రైలు.. దేశీయంగా నిర్మించిన తొలి సెమీ హైస్పీడ్ రైలుగా గుర్తింపు సాధించింది. 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ-వారణాసి వందే భారత్ రైలు ప్రారంభమైంది. 2022-23 మధ్య కాలంలో సుమారు 31 లక్షల మంది వందే భారత్‌‌లో ప్రయాణించారు. ఈ రైలు ఆక్యుపెన్సీ రేషియో ఏకంగా 96.62 శాతంగా ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఇక జమ్ము కశ్మీర్ వాతావరణ పరిస్థితులకు అనుగూణంగా వందే భారత్‌ను సిద్ధం చేశారట.


ఇతర వందే భారత్ సర్వీసులతో పోలిస్తే ఇందులో స్థానిక వాతావరణాన్ని తట్టుకునేలా అనేక అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. నీరు గడ్డ కట్టకుండా చూసే హీటింగ్ వ్యవస్థలు, బయోటాయిలెట్ ట్యాంక్స్, చలి వాతావరణంలో సమర్థవంతంగా పనిచేసేలా ఎయిర్ బ్రేక వ్యవస్థ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏసీ కోచ్‌లు, ఆటోమేటిక్ డోర్లు, వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. కశ్మీర్‌ను మిగతా దేశంతో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన ఉధంపూర్-శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్‌లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 25 , 2025 | 10:25 PM