Share News

Chennai: డీఎంకే పాలనను విమర్శించను.. కూటమిని విడిచి పెట్టను

ABN , Publish Date - Jul 03 , 2025 | 10:13 AM

డీఎంకే పాలనపై తాను ఎలాంటి విమర్శలు చేయలేదని, భవిష్యత్తులోనూ ఆరోపణలు, విమర్శలు చేయబోనని ఎండీఎంకే నేత వైగో స్పష్టం చేశారు.

Chennai: డీఎంకే పాలనను విమర్శించను.. కూటమిని విడిచి పెట్టను

- ఎండీఎంకే నేత వైగో

చెన్నై: డీఎంకే పాలనపై తాను ఎలాంటి విమర్శలు చేయలేదని, భవిష్యత్తులోనూ ఆరోపణలు, విమర్శలు చేయబోనని ఎండీఎంకే నేత వైగో స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆయన అన్నా అరివాలయానికి వెళ్ళి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కలుసుకుని, సత్కరించారు. సుమారు పావుగంట సేపు సమావేశమై రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సమీక్షించి, అసెంబ్లీ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహరచనలపై చర్చించారు.


ఈ సమావేశం అనంతరం అరివాలయం వెలుపల వైగో మడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు. డీఎంకే, ఎండీఎంకే మధ్య విబేధాలు ఏర్పడ్డాయని ఇటీవల వచ్చిన పుకార్లను ఆయన తోసిపుచ్చారు. రెండు పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు.


nani1.2.jpg

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పది సీట్లకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని ఎండీఎంకే సర్వసభ్యమండలి సమావేశంలో తీర్మానం చేసినమాట వాస్తవమేనని, అదే సమయంలో డీఎంకే అధిష్టానంపై ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని వైగో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!

రేవంత్‌.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Jul 03 , 2025 | 10:13 AM