Share News

PM Modi: వైభవ్..ఎంత ఎక్కువ ఆడితే అంతగా అభివృద్ధి చెందుతారు

ABN , Publish Date - May 05 , 2025 | 11:28 AM

ఖేలో ఇండియా ప్రారంభోత్సవం సందర్భంగా వైభవ్ సూర్యవంశీని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. కేవలం 14 ఏళ్లలోనే గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ సాధించి వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

PM Modi: వైభవ్..ఎంత ఎక్కువ ఆడితే అంతగా అభివృద్ధి చెందుతారు
Vaibhav Suryavamshi PM Modi

ఐపీఎల్‌ 2025లో ఇటీవల 35 బంతుల్లో సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అతని బ్యాటింగ్ తీరు గురించి ఇప్పటికే అనేక మంది మెచ్చుకోగా, తాజాగా ప్రధాని మోదీ కూడా అతని గురించి ప్రశంసించడం విశేషం. బీహార్‌ పాటలీపుత్ర స్టేడియంలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ప్రారంభ వేడుక సందర్భంగా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూశానని మోదీ అన్నారు. ఐపీఎల్‌లో బీహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు. వైభవ్ చిన్న వయసులోనే పెద్ద రికార్డు సృష్టించాడని కొనియాడారు.

కొత్త క్రీడలు..

అతని ఆట వెనుక ఉన్న కృషి, పట్టుదల వల్ల వివిధ స్థాయిలలో మ్యాచ్‌లు ఆడేందుకు సహాయపడిందన్నారు. దీని అర్థం ఎంత ఎక్కువ ఆడితే అంతగా అభివృద్ధి చెందుతారని వెల్లడించారు మోదీ. మన అథ్లెట్లకు కొత్త క్రీడలు ఆడటానికి అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు ప్రధాని మోదీ. అందుకే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో గట్కా, ఖో ఖో, మల్లఖంబ్, యోగాసనాలను చేర్చినట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా మన అథ్లెట్లు వుషు, లాన్ బౌల్స్, రోలర్ స్కేటింగ్ వంటి అనేక కొత్త క్రీడలలో చాలా బాగా రాణించారుని ప్రధాని మోదీ గుర్తు చేశారు.


వేగవంతమైన సెంచరీ

14 ఏళ్ల ఆటగాడు గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన తన మూడో IPL మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో పురుషుల T20 క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. దీంతోపాటు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన క్రిస్ గేల్ తర్వాత వైభవ్ ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు.


ప్రశంసలు..

ఈ యువ ఆటగాడి ఊచకోతను చూశాను. నమ్మశక్యం కాదని, మిస్టర్ 360 డిగ్రీ అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. 14 ఏళ్ల వయసులో నువ్వు ఏం చేసేవాడివి? ఈ పిల్లవాడు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను రెప్పవేయకుండా ఎదుర్కొంటున్నాడు. వైభవ్ సూర్యవంశీ పేరు గుర్తుంచుకో. నిర్భయ వైఖరితో ఆడుతున్నాడు. తరువాతి తరం మెరుస్తున్నట్లు చూడటం చాలా గర్వంగా ఉందన్నాడు యువరాజ్ సింగ్. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రతిభతో ఆడాడని, కేవలం 14 ఏళ్ల వయసులోనే సెంచరీ చేయడం గ్రేట్ అని కొనియాడారు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.


ఇవి కూడా చదవండి:

Tom Bailey: మ్యాచ్ ఆడుతున్న క్రమంలో జేబులోంచి పడిన మొబైల్.. వీడియో వైరల్


Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం


Punjab Kings: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్..పట్టికలో కూడా..


Virat Kohli: ఆరెంజ్ క్యాప్‌ తిరిగి లాగేసుకున్న విరాట్ కోహ్లీ..ఇలాగే ఉంటుందా..


Read More Business News and Latest Telugu News

Updated Date - May 05 , 2025 | 11:29 AM