Share News

Avalanche: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. చిక్కుకున్న 57 మంది కార్మికులు

ABN , Publish Date - Feb 28 , 2025 | 02:44 PM

ఇండియా-చైనా సరిహద్దు ప్రాంతంలోని ఎత్తైన పర్వత ప్రాంతం వద్ద రోడ్డు నిర్మాణం పనిలో కార్మికులు ఉండగా హిమపాతం విరుచుకుపడింది. సమాచారం తెలియగానే పోలీసులు, బీఆర్ఓ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Avalanche: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. చిక్కుకున్న 57 మంది కార్మికులు

చమోలి: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో పెనుప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం మంచు చరియలు విరిగిపడి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌ (BRO)కు చెందిన సుమారు 57 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇండియా-చైనా సరిహద్దు ప్రాంతంలోని ఎత్తైన పర్వత ప్రాంతం వద్ద రోడ్డు నిర్మాణం పనిలో కార్మికులు ఉండగా హిమపాతం విరుచుకుపడింది. సమాచారం తెలియగానే పోలీసులు, బీఆర్ఓ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సాయంత్రానికి 16 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు.

Torrential Rains in Himachal Pradesh: హిమపాతం, భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం


avalanche2.jpg

మనా గ్రామానికి సమీపంలో మంచు చరియలు విరిగిపడి కార్మికులు చిక్కుకున్నప్పుడు సమాచారం అందిందని, వెంటనే ఐడీబీపీ, బీఆర్ఓ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించినట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరూ సురక్షితంగా బయపడాలని లార్డ్ బద్రి విశాల్‌ను ప్రార్థిస్తు్న్నట్టు చెప్పారు.


uttarakhand1.jpg

కాగా, బీఆర్ఓ వర్క్ సైట్‌ను హిమ చరియలు విరుచుకుపడటంతో ప్రమాదం జరిగినట్టు ఉత్తరాఖండ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి, ఐజీ నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు. నాలుగు అంబులెన్స్‌లను ప్రమాదస్థలికి పంపామని, విపరీతమైన మంచుకారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్నట్టు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీఆర్ మీనా చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా అధిగమించి బాధితులను రక్షించేందుకు ఆర్మీ, ఎస్‌డీఆర్ఎఫ్, స్థానిక అధికారులు ఆపరేషన్ సాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు,మంచు చరియలు విరిగిపడుతుండటంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మరిన్ని మంచు చరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

Mamata Banerjee: నకిలీ ఓటర్లతో ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు

Ministerial orders: పార్సిళ్లకు ప్లాస్టిక్‌ వద్దు.. ఇడ్లీ తయారీలోనూ గుడ్డలు మాత్రమే వాడాలి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 28 , 2025 | 07:44 PM