US Urges G7 To Impose: భారీ సుంకాలతో బాదేయండి
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:31 AM
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాపై భారీ సుంకాలు విధించాలని జీ7 దేశాలను అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో...
భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోండి
జీ-7 సభ్య దేశాలపై అమెరికా ఒత్తిడి
న్యూయార్క్, సెప్టెంబరు 13: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాపై భారీ సుంకాలు విధించాలని జీ7 దేశాలను అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మాస్కో ఆదాయ మార్గాలను మూసివేసే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ యంత్రాంగం తాజా ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చింది. కెనడా ఆర్థిక మంత్రి నేతృత్వంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జీ7 సభ్య దేశాల ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌కు నిధులు సమకూర్చడానికి స్తంభింపజేసిన రష్యన్ ఆస్తులను ఉపయోగించుకోవడం సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సుంకాల విషయంలో తాను అనుసరిస్తున్న మార్గాన్ని పాటించాలని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెస్సెంట్ వారిని కోరారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా నాటో దేశాలు చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధించాలని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దీనికి నాటో దేశాలన్నీ అంగీకరిస్తే రష్యాపై భారీ ఆంక్షలు విధించడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో శనివారం పోస్టు చేశారు. నాటో దేశాలు రష్యా నుంచి చములు కొనుగోలు చేస్తుండటంపై ఆయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇటువంచి చర్యలు రష్యాతో చర్చలు, బేరసారాలను బలహీనపరుస్తున్నాయన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News