Mary Millben Defends PM Modi: మోదీకి మద్దతుగా అమెరికా సింగర్.. రాహుల్ గాంధీపై విమర్శలు..
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:24 PM
అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్ ప్రధాని మోదీకి మద్దతుగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. దేశ ప్రధాని అయ్యే లక్షణం రాహుల్‌లో లేదన్నారు. మళ్లీ ‘ఐ హేట్ ఇండియా టూర్’ చేసుకుంటే మంచిదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భయపడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టుపై అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్(American singer Mary Millben) స్పందించారు. ప్రధాని మోదీకి మద్దతుగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘మీరు తప్పుగా అనుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు ట్రంప్‌కు భయపడ్డం లేదు.
దీర్ఘకాలంలో అమెరికాతో మంచి సంబంధాల గురించే మోదీ ఆలోచిస్తున్నారు. అదొక స్ట్రాటెజీ. మోదీ ఇండియాకు ఎప్పుడూ మంచే చేస్తారు. అది అభినందనీయం. దేశ నాయకులు దేశం కోసం ఏది మంచిదో అదే చేస్తారు. ఇలాంటి నాయకత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే భారత ప్రధాని అయ్యే ఒక్క లక్షణం కూడా నీలో లేదు. నువ్వు మళ్లీ (I Hate India Tour) ‘ఐ హేట్ ఇండియా టూర్’ చేసుకుంటే మంచిది’ అని అన్నారు.

ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారు?..
రాహుల్ గాంధీ నిన్న తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టులో ఐదు పాయింట్లను రాసుకొచ్చారు. ‘ప్రధాని మోదీ ట్రంప్‌కు భయపడ్డారు’ అని టైటిల్ పెట్టి..
రష్యాతో ఆయిల్ కొనాలా వద్దా అన్నది ట్రంప్ డిసైడ్ చేస్తాడు. ఆయనే స్వయంగా ప్రకటన కూడా విడుదల చేస్తాడు.
ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా ట్రంప్‌ను అభినందిస్తూ ఉన్నారు.
ఫినాన్స్ మినిష్టర్ అమెరికా పర్యటనను రద్దు చేశారు.
షర్మ్ ఎల్ షేక్‌ను స్కిప్ చేశారు.
ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్ చర్యల్ని వ్యతిరేకించలేదు.
ఇవి కూడా చదవండి
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపిస్తున్న టీటీపీ..
తీవ్ర విషాదం.. సమోసాల కోసం వెళుతూ..