Share News

Delhi: భారతీయులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు: అమెరికా విదేశాంగ కార్యదర్శి..

ABN , Publish Date - Jan 26 , 2025 | 09:36 AM

ఢిల్లీ: భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శుభాకాంక్షలు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్(US), న్యూఢిల్లీ(Delhi) మధ్య 21వ శతాబ్దంలో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటోందని రూబియో చెప్పారు.

Delhi: భారతీయులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు: అమెరికా విదేశాంగ కార్యదర్శి..
Marco Rubio

ఢిల్లీ: భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో(Marco Rubio) శుభాకాంక్షలు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్(US), న్యూఢిల్లీ(Delhi) మధ్య 21వ శతాబ్దంలో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటోందని రూబియో చెప్పారు. రిపబ్లిక్‌ వేడుకల నేపథ్యంలో న్యూఢిల్లీలోని కర్తవ్య మార్గ్‌లో ఆదివారం జరిగే వార్షిక కవాతులో భారత్ తన సైనిక శక్తి, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శన చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. భారతదేశ ప్రజలు తమ దేశ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున అమెరికా తరఫున వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.


రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా భారత్ వేడుక చేసుకోబోతుందని, ఇదే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగమని రూబియో పేర్కొన్నారు. అమెరికా, భారత్ మధ్య స్నేహం ఎప్పటిలాగానే భవిష్యత్‌లోనూ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఇది ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుందని చెప్పుకొచ్చారు. సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించేందుకు క్వాడ్‌లో అంతరిక్ష పరిశోధనలను ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాల మధ్య మరింత సహకారం పెంపొందించేందుకు ఎదురు చూస్తున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

Vande Bharat : చినాబ్‌ వంతెనపై వందేభారత్‌ చుక్‌ చుక్‌!

Updated Date - Jan 26 , 2025 | 09:39 AM