Target Pakistan: తుడిచి పెట్టేయాల్సిందే
ABN , Publish Date - Apr 25 , 2025 | 05:18 AM
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మిచెల్ రూబెన్ విమర్శించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు
లాడెన్‌కు, పాక్ ఆర్మీ చీఫ్‌కు తేడా లేదు
అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి రూబెన్
న్యూఢిల్లీ/శ్రీనగర్, ఏప్రిల్ 24: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంతో పాటు అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చేసే దేశంగా అధికారిక ముద్ర వేయాలని అమెరికా ప్రభుత్వానికి ఆ దేశ రక్షణ శాఖ మాజీ అధికారి మిచెల్ రూబెన్ అన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై ధ్వజమెత్తారు. ఆయనకు, బిన్ లాడెన్‌కు తేడా లేదని, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఉగ్రవాదుల మారణకాండకు భారత్ కూడా ప్రత్యక్షంగా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ‘హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ చూపిన అదే స్పష్టతతో భారత్ ప్రతిస్పందించాలి’ అని కోరారు. స్పష్టంగా చెప్పాలంటే.. హమాస్ విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరించిన విధంగానే.. పాకిస్థాన్, పాక్ ఐఎస్ఐ విషయంలో చేయడం ప్రస్తుతం భారత్ విధి అని అన్నారు. ‘కశ్మీర్ పాకిస్థాన్ జీవనాడి’ అంటూ ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఆయన చేసిన ప్రసంగం ఉగ్రవాదానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఉందన్నారు. ‘భారత్ ఇప్పుడు చేయాల్సింది ఆ జీవనాడిని కత్తిరించడమే..’ అని స్పష్టం చేశారు.
తిరగబడాలి: జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ
పహల్గాం ఉగ్రదాడిని ‘పుల్వామా-2 ఘటన’గా జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ పోల్చారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన విఽధంగానే ఇది కూడా ఉందన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇటీవల చేసిన ‘హిందూ వ్యతిరేక’ ప్రసంగం గురించి ప్రస్తావించారు. ఇజ్రాయెల్ చేసినట్లుగానే భారత ప్రభుత్వం కూడా ప్రతిస్పందించాలని, పాకిస్థాన్‌ను నాలుగు ముక్కలు చేయాలని ఆయన కోరారు. భారత ప్రభుత్వం పాక్ ఆర్మీ వెన్ను విరిచేయాలని, పాకిస్థాన్‌ను 4 ముక్కలు చేయాలని పాల్ అన్నారు.
పీవోకేలో హమాస్ నేతలు
2023, అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి, తాజాగా పహల్గాంలో ఉగ్రవాదుల మారణకాండకు పోలికలున్నాయని భారత్‌కు ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ అన్నారు. రెండు ఘటనల్లోనూ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. పీవోకేలో ఇటీవల హమాస్ నేతలు పర్యటించారని, అక్కడ జైషే మహ్మద్ ఉగ్రవాదులను కలిసినట్లు తెలిసిందని తెలిపారు. ఆ తర్వాతనే జరిగిన పహల్గాం దాడి అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్