Share News

UP Businessman Arrested For Spying: పాక్ ఐఎస్ఐ తరపున గూఢచర్యం.. భారతీయ వ్యాపారి అరెస్టు

ABN , Publish Date - May 19 , 2025 | 09:12 AM

పాక్ ఐఎస్ఐ తరపున గూఢచర్యానికి పాల్పడుతున్న యూపీ వ్యాపారిని స్థానిక పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

UP Businessman Arrested For Spying: పాక్ ఐఎస్ఐ తరపున గూఢచర్యం.. భారతీయ వ్యాపారి అరెస్టు
Pakistan ISI espionage

ఇంటర్నెట్ డెస్క్: పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడుతూ మరో వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో యూపీకి చెందిన వ్యాపారి షహ్‌జాద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు. షహ్‌జాద్ గూఢచర్యంతో పాటు పాక్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందడంతో యూపీ పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్సు అతడిని మొరాదాబాద్‌లో అరెస్టు చేసింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం అతడు గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. జాతీయ భద్రతకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని తన హ్యాండ్లర్‌లకు పంపిస్తున్నట్టు తెలిపారు.


గత కొన్నేళ్లల్లో షహ్‌జాద్ పలుమార్లు పాక్ వెళ్లి వచ్చాడని, స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. కాస్మెటిక్స్, దుస్తులు, సుగంధద్రవ్యాలు వంటివి అక్రమంగా సరిహద్దులు దాటించాడు. స్మగ్లింగ్ మాటునే అతడు ఐఎస్ఐ తరపున గూఢచర్యానికి దిగినట్టు తెలిపారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్లకు షహ్‌జాద్ డబ్బు, భారతీయ సిమ్ కార్డులను అందించేవాడు. యూపీలోని రామ్‌పూర్‌తో పాటు ఇతర జిల్లాల్లోని వారిని ఐఎస్‌ఐకి పనిచేయించేందుకు పాక్‌కు కూడా పంపించేవాడని అన్నారు. ఈ వీసాలను ఐఎస్ఐ ఏజెంట్సే ఏర్పాటు చేసేవారని కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు.


హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ కోసం గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన విషయం తెలిసిందే. ట్రావెల్ విత్ జో పేరిట ఆమె నిర్వహించే ఛానల్‌కు సుమారు 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో ఆమె టచ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మే 13న భారత ప్రభుత్వం సదరు పాక్ ఉద్యోగిని గూఢచర్యం నేరంపై బహిష్కరించింది. ఇదిలా ఉంటే జ్యోతి మల్హోత్రా ఓసారి పాక్‌ను సందర్శించి ఆ పర్యటన తాలూకు వీడియోలను కూడా నెట్టింట షేర్ చేసింది.

ఇవీ చదవండి:

ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటే.. భారత్‌కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 10:34 AM