University Faculty Appointments: అధ్యాపక నియామకాల్లో ఎన్‌ఎఫ్‌ఎస్‌పై కన్ను
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:41 AM
యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాల విషయంలో వివాదాస్పద తగిన అభ్యర్థి దొరకలేదు...
వర్సిటీల నిర్ణయాలపై పరిశీలన చేయనున్న యూజీసీ
న్యూఢిల్లీ, ఆగస్టు 12: యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాల విషయంలో వివాదాస్పద ‘తగిన అభ్యర్థి దొరకలేదు(నాట్ ఫౌండ్ సూటిబుల్-ఎన్‌ఎ్‌ఫఎస్)’ నిబంధనపై నియంత్రణను కఠినతరం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై యూజీసీ ఏర్పాటు చేసిన కమిటీ ఎన్‌ఎ్‌ఫఎస్ ప్రతి సందర్భాన్ని సమీక్ష కోసం కమిషన్‌కు అధికారికంగా నివేదించేలా సిఫారసు చేయనుందని భావిస్తున్నారు. దీని వల్ల పోస్టుల భర్తీ సమయంలో ఎప్పుడు సరైన అభ్యర్థి దొరకలేదనే నిబంధను ఉపయోగిస్తారో.. దాన్ని సమర్థించుకొనేలా వర్సిటీలు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఆ కారణాలను యూజీసీ పరిశీలించి.. తగిన సూచనలు లేదా ప్రత్యామ్నాయ నియామక ఆప్షన్లను అందించే వీలుంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు దక్కకుండా ‘ఎన్‌ఎ్‌ఫఎస్’ క్లాజ్‌ను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో ఎన్‌ఎ్‌ఫఎస్ సాకుతో నియామకాలను తప్పుదోవ పట్టించారని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలోనే ఖాళీ పోస్టులు భారీగా పెరిగాయని విపక్షాలు అంటున్నాయి. ఈ సమస్యకు కారణాలు గుర్తించేందుకు యూజీసీ జూన్ 19న కమిటీని ఏర్పాటు చేసింది. రిజర్వేషన్ వర్గాల అసమాన ప్రాతినిధ్యానికి ఎన్‌ఎ్‌ఫఎస్ దోహదపడిందా? అనే దాన్ని నిర్ధారించేందుకు వర్సిటీలు, క్యాటగిరీల వారీ డేటాను సమగ్రంగా విశ్లేషించనుంది.
ఇవి కూడా చదవండి
గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..
For More National News and Telugu News