UGC Bans Online: ఆ కోర్సులు ఆన్‌లైన్, దూరవిద్య విధానాల్లో వద్దు
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:06 AM
ఈ విద్యా సంవత్సరం నుంచి హెల్త్‌కేర్, దాని అనుబంధ కోర్సులను సైకాలజీ, న్యూట్రిషన్ సహా ఓపెన్, దూరవిద్య, ఆన్‌లైన్ విధానాల్లో ఆఫర్ చేయవద్దని యూజీసీ..
హెల్త్‌కేర్, సైకాలజీ, న్యూట్రిషన్ కోర్సులపై యూజీసీ ఆదేశం
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఈ విద్యా సంవత్సరం నుంచి హెల్త్‌కేర్, దాని అనుబంధ కోర్సులను(సైకాలజీ, న్యూట్రిషన్ సహా) ఓపెన్, దూరవిద్య, ఆన్‌లైన్ విధానాల్లో ఆఫర్ చేయవద్దని యూజీసీ అన్ని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది. ‘నేషనల్ కమిషన్ ఫర్ అలీడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్’(ఎన్‌సీఏహెచ్‌పీ) చట్టం, 2021 కింద ఆఫర్ చేసే సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయో టెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్ వంటి కోర్సులకు కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. ఒకవేళ ఏదైనా విద్యాసంస్థకు ఇప్పటికే ఈ కోర్సులకు అనుమతి మంజూరు చేసినా దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి ప్రకటించారు. అందువల్ల ఏ విద్యాసంస్థా ఈ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవద్దని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News