Share News

Uddhav-Raj meet: మళ్లీ కలుసుకున్న ఠాక్రే సోదరులు.. ఈసారి ఎక్కడంటే

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:50 PM

మహారాష్ట్ర విజయ్ ర్యాలీ గత జూలైలో జరిగినప్పుడు ఠాక్రే సోదరులిద్దరూ ఒకే వేదికపైకి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇద్దరు నేతలూ పలుమార్లు సమావేశమయ్యారు. గత నెలలో రాజ్ నివాసమైన శివ్‌తీర్ధ్‌కు ఉద్ధవ్ వెళ్లి కలుసున్నారు.

Uddhav-Raj meet: మళ్లీ కలుసుకున్న ఠాక్రే సోదరులు.. ఈసారి ఎక్కడంటే
Uddhav Thackeray and Raj Thackeray met again

ముంబై: ముంబైలో ఆదివారం నాడు జరిగిన ఈవెంట్‌లో ఠాక్రే సోదరులు మరోసారి కలుసుకున్నారు. శివసేన యూబీటీ (Shiv Sena-UBT) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) వ్యవస్థాపకుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) ముంబైలో జరిగిన సంజయ్ రౌత్ (Sanjay Raut) మనవడి నామకరణోత్సవానికి హాజరయ్యారు. సోదరులిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో శివసేన యూబీటీ-ఎంఎన్‌ఎస్ కలిసి పోటీ చేయనున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో ఠాక్రే సోదరులు మరోసారి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్ శివసేన నేతలు అనిల్ దేశాయ్, మిలంద్ నార్వేకర్‌ సందడిగా నామకరణోత్సవంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మహారాష్ట్ర విజయ్ ర్యాలీ గత జూలైలో జరిగినప్పుడు ఠాక్రే సోదరులిద్దరూ ఒకే వేదికపైకి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇద్దరు నేతలూ పలుమార్లు సమావేశమయ్యారు. గత నెలలో రాజ్ నివాసమైన శివ్‌తీర్ధ్‌కు ఉద్ధవ్ వెళ్లి కలుసున్నారు. దీనికి ముందు గణేశ్ చతుర్ధి ఉత్సవాల సందర్భంగానూ ఇద్దరూ కలిశారు. గత ఆగస్టులో BEST ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో యూబీటీ, ఎంఎన్ఎస్ కలిసి పోటీ చేశాయి. అయితే బీజేపీ చేతిలో 21 సీట్లు కోల్పోయాయి. 21 మందిలో 18 మందిని యూబీటీ నిలబెట్టగా, ఎంఎన్ఎస్ ఇద్దరిని పోటీకి దింపింది.


ఇవి కూడా చదవండి..

లెహ్ నిరసనకారుల మృతిపై న్యాయవిచారణకు వాంగ్‌చుక్ డిమాండ్

డార్జిలింగ్‌లో కొండచరియల బీభత్సం.. 17 మందికి చేరిన మృతులు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2025 | 06:28 PM