JEE Main 2025: జేఈఈ మెయిన్ సెషన్-1లో 14 మందికి 100 పర్సంటైల్!
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:26 AM
జేఈఈ మెయిన్ సెషన్-1 తుది కీని సోమవారం వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఫలితాలను విడుదల చేసింది.ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీ, బీఈ/బీటెక్, కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా 22, 23, 24, 28, 29 తేదీల్లో మెయిన్ సెషన్-1లో భాగంగా పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరిగాయి.

వీరిలో రాజస్థాన్ నుంచే ఐదుగురు
జాబితాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు
తెలంగాణ నుంచి బాని బ్రతా మాజీ,
ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ
ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు
మెయిన్ సెషన్-2 పరీక్షల నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (జేఈఈ) మెయిన్ 2025 సెషన్-1 (పేపర్-1 బీఈ, బీటెక్) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు ‘100 పర్సంటైల్’ తో సత్తా చాటారు. వీరిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుంచి బాని బ్రతా మాజీ, ఏపీలోని గుంటూరుకు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 100 పర్సంటైల్ సాధించారు. జేఈఈ మెయిన్ సెషన్-1 తుది కీని సోమవారం వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఫలితాలను విడుదల చేసింది. ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీ, బీఈ/బీటెక్, కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా 22, 23, 24, 28, 29 తేదీల్లో మెయిన్ సెషన్-1లో భాగంగా పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరిగాయి. హండ్రెడ్ పర్సంటైల్ సాధించిన విద్యార్థుల్లో అత్యధికంగా రాజస్థాన్ నుంచి ఐదుగురు విద్యార్థులు ఉండటం విశేషం. ఆ తర్వాత ఢిల్లీ, యూపీ నుంచి ఇద్దరు చొప్పున విద్యార్థులు హండ్రెడ్ పర్సంటైల్ సాధించారు.
ఈడబ్ల్యూఎస్ జనరల్ విభాగంలో ఏపీకి చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.9968125 పర్సంటైల్‌తో టాపర్‌గా నిలిచారు. జేఈఈ మెయిన్ కోసం 13,11,544 మంది రిజిస్టర్ చేసుకోగా, 12,58,136 మంది హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌ను ఏడాదిలో రెండు సెషన్లుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ రెండింటిలో అభ్యర్థుల అత్యుత్తమ స్కోరును జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. కాగా మెయిన్ సెషన్-1లో వికారాబాద్ జిల్లా పరిగి విద్యార్థి ప్రణవ్ తేజ్ 99.9 పర్సంటైల్ సాధించాడు. కాగా బీ-ఆర్కిటెక్చర్, బీ-ప్లానింగ్‌కు సంబంధించి పేపర్-2 పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని ఎన్టీఏ తెలిపింది.
జేఈఈ మెయిన్-2025 సెషన్-1 టాపర్స్
1. ఆయూష్ సింఘాల్ (రాజస్థాన్) 2. కుశాగ్ర గుప్తా (కర్ణాటక) 3. దక్ష్, ఢిల్లీ (ఎన్సీటీ)
4. హర్సింఝా, ఢిల్లీ (ఎన్సీటీ) 5. రజిత్ గుప్తా, రాజస్థాన్ 6.శ్రేయాస్ లోహియా (యూపీ)
7. సక్షమ్ జిందాల్, (రాజస్థాన్) 8. సౌరవ్ (యూపీ) 9. విశాద్ జైన్ (మహారాష్ట్ర) 10. అర్ణవ్ సింగ్ (రాజస్థాన్) 11. శివేన్ వికాస్ తోష్నివాల్ (గుజరాత్) 12. సాయి మనోజ్ఞ గుత్తికొండ (ఏపీ) 13. ఓం ప్రకాశ్ బెహ్రా (రాజస్థాన్) 14. బనీ బ్రత మాజీ (తెలంగాణ)
ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌పై ఆసక్తి
జేఈఈ మెయిన్ తొలిసెషన్‌లో టాపర్‌గా నిలిచిన బనిబ్రాతా మాజీ తనకు బాంబే లేదా ఢిల్లీ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని ఉందని పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్‌లో టాప్-2 ర్యాంకు సాధించడాన్నే లక్ష్యంగా పెట్టుకొని సిద్ధమవుతున్నానని చెప్పాడు. బని బత్రా తల్లిదండ్రుల స్వస్థలం పశ్చిమ బెంగాల్ అయినా 20 ఏళ్ల క్రితమే ఈ కుటుంబం హైదరాబాద్‌కొచ్చి స్థిరపడింది. తండ్రి స్వరూప్ మాజీ హైదరాబాద్‌లోనే కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖలో పనిచేస్తున్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు
Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For National News And Telugu News