Share News

Supreme Court: ఒకే షిఫ్టులో నీట్‌ పీజీ ఎంట్రన్స్‌

ABN , Publish Date - May 31 , 2025 | 05:19 AM

సుప్రీంకోర్టు నీట్ పీజీ 2025 ప్రవేశ పరీక్షను రెండు షిఫ్టులుగా నిర్వహించకుండా ఒకే షిఫ్టులో నిర్వహించాలని ఆదేశించింది. ఇది విద్యార్థులకు కలిగే అన్యాయాన్ని తగ్గించి పారదర్శకతను పెంచుతుందని తెలిపింది.

Supreme Court: ఒకే షిఫ్టులో నీట్‌ పీజీ ఎంట్రన్స్‌

ఈ దేశంలో పరీక్ష కేంద్రాలు లేవా?

విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు

కీలక తీర్పు ఇచ్చిన త్రిసభ్య ధర్మాసనం

న్యూఢిల్లీ, మే 30: వైద్య విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షను ఒక షిఫ్టులోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రెండు షిఫ్టులుగా విద్యార్థులను విభజించి ప్రవేశ పరీక్షను నిర్వహించడం అంటే.. వారిని ఇబ్బంది పెట్టడమేనని.. ప్రశ్నల క్లిష్టత మారి.. వారిని నష్టపరచడమే అవుతుందని స్పష్టం చేసింది. ఇది ఒకరకంగా ఏకపక్ష నిర్ణయానికి దారి తీసే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు నీట్‌-పీజీ-2025 ప్రవేశ పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలో త్రిసభ్య సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. రెండు షిఫ్టులుగా నిర్వహిస్తే.. ఏ రెండు ప్రశ్న పత్రాలు ఒకే విధంగా ఉండవని, తద్వారా విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని ధర్మాసనం పేర్కొంది. ఒకే షిఫ్టులో ప్రవేశ పరీక్షను నిర్వహించడం ద్వారా పారదర్శకతకు, నిర్వహణకు మరింత పెద్దపీట వేసినట్టు అవుతుందని తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని నీట్‌ను ఆదేశించింది. నీట్‌-పీజీ-2025 ప్రవేశ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 2,42,678 మంది దరఖాస్తు చేసుకున్నారని, పైగా ఒకే నగరంలో నిర్వహించడం లేదని, పైగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రెండు షిఫ్టులుగా నిర్వహిస్తామన్న వాదనను తాము అంగీకరించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.


ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు జూన్‌ 15వ తేదీ వరకు గడువు ఉందని.. ఈలోగా ఏర్పాట్లు చేసుకునేందుకు చాలానే సమయం ఉందని పేర్కొంది. మరిన్ని కేంద్రాలను వెతికి.. సొమ్ము ఖర్చు చేస్తే ఏర్పాట్లు చేయొచ్చని, కానీ మీరు(నీట్‌ నిర్వాహకులు) సొమ్ము ఖర్చు చేసేందుకు, కనీసం ప్రయత్నం చేసేందుకు కూడా ఇష్టపడడం లేదని అర్ధమవుతోందని వాఖ్యానించింది. ‘‘ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించమంటే కనీసం మీరు ఆలోచన కూడా చేయడం లేదు. పైగా అదేదో జరుగుతుంది. ఇదేదో జరుగుతుంది.. అంటూ.. ఏడాది పొడవునా ఏవో కథలు చెప్పి బెదిరిస్తున్నారు. ఇవేమీ కుదరవు. ముందు మీరు సంసిద్ధులు అవ్వండి. రెండు షిఫ్టులు వద్దు. ఒకే షిఫ్టులో నిర్వహించండి. ఈ దేశంలో పరీక్ష కేంద్రాలకు కొరత రాలేదు.’’ అని నీట్‌ను ఉద్దేశించి సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, నీట్‌ తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది.. ఇది గతంలో సుప్రీంకోర్టు విధించిన సమయ పాలనకు విఘాతం చేకూరుస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు.. ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహిస్తే మాల్‌ ప్రాక్టీ్‌సకు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే, ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌కు సంబంధించి అవసరమైతే మరింత సమయం ఇస్తామని, దానికి ప్రత్యేకంగా పిటిషన్‌ వేసుకోవచ్చని తెలిపింది. ఇదే సమయంలో పిటిషనర్లు పరీక్ష ఫలితాలు వెల్లడించిన తర్వాత ఎన్‌బీఈఎంఎస్‌ వెబ్‌సైట్‌లో సమాధాన పత్రాలు, కీని వెల్లడించేలా ఆదేశించాలని కోరా రు. అయితే.. దీనిపై ప్రత్యేకంగా విచారించాల్సి ఉందంటూ ఈ పిటిషన్‌పై విచారణను జూన్‌ 14కు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 05:19 AM