TVK Chief Vijay: టీవీకే అధినేత విజయ్ సభలో గన్ కలకలం
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:24 PM
సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత తొలిసారిగా టీవీకే అధినేత విజయ్ పుదుచ్చెరిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు ఓ వ్యక్తి గన్‌తో రావడంతో తీవ్ర కలకలం రేగింది.
తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన వాళ్లు తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమదైన మార్క్ చాటుకున్నారు. వారి బాటలోనే నడుస్తూ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఇటీవల కరూర్‌లో తొక్కిసలాట జరిగిన తర్వాత, టీవీకే అధినేత విజయ్ ఈ రోజు (మంగళవారం) పుదుచ్చేరిలో తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభా వేదిక వద్దకు ఓ వ్యక్తి తుపాకీతో రావడం గమనించిన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వ్యక్తి పేరు డేవిడ్ అని, తమిళనాడు శివగంగై జిల్లా నివాసి అని తెలుస్తోంది. డేవిడ్ టీవీకే పార్టీ పుదుచ్చేరి జిల్లా కార్యదర్శి ప్రభు పర్సనల్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. మెటల్ డిటెక్టర్ గేట్ వద్ద రొటీన్ చెకప్ చేస్తున్న సమయంలో పోలీసులు తుపాకిని కనుగొన్నారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని విచారిస్తున్నారు.
ఈ ఘటన తర్వాత పుదుచ్చేరి పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. విజయ్ నిర్వహించే సభా వేదిక వద్ద అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీనియర్ ఎస్పీ ఆర్.కలైవానన్ తెలిపారు. కాగా, పోలీసులు మొదట ఈ రోడ్ షోకి అనుమతి ఇవ్వలేదు. తర్వాత కఠిన షరతులతో అనుమతి లభించింది.
ఇవి కూడా చదవండి
చూపు లేని చిన్నారుల కోసం 'వైల్డ్ వాటర్స్' ప్రత్యేక కార్యక్రమం
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?