Share News

Collector: తుంగభద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:48 PM

తుంగభద్ర జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. నగరంలోని జిల్లాకలెక్టర్‌ కార్యాలయం కేశ్వన్‌ వీడియో హాలులో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Collector: తుంగభద్ర తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

- మూసేసిన వంతెనలపై ప్రయాణించరాదు

- తుంగభద్ర ఉధృతి పెరిగే అవకాశం: కలెక్టర్‌

బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా(Collector Prashant Kumar Mishra) పేర్కొన్నారు. నగరంలోని జిల్లాకలెక్టర్‌ కార్యాలయం కేశ్వన్‌ వీడియో హాలులో మంగళవారం జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గంగావతి(Gangavathi) ఫ్లైఓవర్‌ మీదుగా నీరు ప్రవహిస్తుందున, ముందుజాగ్రత్తగా వాహనాల రాకపోకలను నిలిపివేశామని, వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.


pandu2.2.jpg

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించడానికి పడవలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలతో నీటి ఉధృతి పెరిగే ప్రమాదం ఉందన్నారు. కంప్లి తాలూకా తహసిల్దార్‌, ఆర్‌ఐ అధికారులు రోజువారీ నీటి మట్టాన్ని తెలుసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆహారం, మందులు అందజేయాలన్నారు. ఈసందర్భంగా అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రమోద్‌, వివిధ జిల్లాస్థాయి శాఖల అధికారులు తాలూకా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


pandu2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2025 | 12:48 PM