Trump Wishes Modi on Birthday: మోదీకి ట్రంప్ బర్త్‌డే విషెస్ థ్యాంక్యూ మై ఫ్రెండ్ అన్న మోదీ
ABN , Publish Date - Sep 17 , 2025 | 06:45 AM
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 75వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని...
న్యూఢిల్లీ, సెప్టెంబరు16: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 75వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. థ్యాంక్యూ మై ఫ్రెండ్ అంటూ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ భారత్-అమెరికా దేశాల మధ్య భాగస్వామాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు మీలాగే(ట్రంప్) నేను కూడా కట్టుబడి ఉన్నాను’’ అని మోదీ పేర్కొన్నారు. అలాగే, ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ట్రంప్ చేస్తున్న కృషికి తమ మద్దతు ఉంటుందని మోదీ తెలిపారు. కాగా, అదనపు సుంకాల నేపథ్యంలో ట్రంప్, మోదీ మధ్య దూరం పెరగ్గా.. ఇరువురు నేతలు మాట్లాడుకోవడం జూన్ 17 తర్వాత ఇదే తొలిసారి.
ఇవి కూాడా చదవండి..
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి