Traffic Cop Flung Into Air: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. కారు దెబ్బకు గాల్లోకి ఎగిరిన ట్రాఫిక్ పోలీస్..
ABN , Publish Date - Aug 24 , 2025 | 09:45 PM
ఓ ట్రాఫిక్ పోలీసు కార్లు టర్న్ తీసుకునే చోట నిలబడి ఉన్నాడు. ఆ కారు వేగంగా ఆయన వైపు దూసుకు వచ్చింది. ఆయన భయపడిపోయాడు. కారు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
ఢిల్లీ -మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్ ఒకటి చోటుచేసుకుంది. ఓ కారు వేగంగా వచ్చి ట్రాఫిక్ పోలీస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ పోలీస్ గాల్లో పల్టీలు కొట్టి దూరంగా ఎగిరిపడ్డాడు. మీరట్ వైపు వెళ్లే మెయిన్ లైన్‌లో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ఆయన్ని మనిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే ఐసీయూలో చికిత్స జరుగుతోంది. ట్రాఫిక్ పోలీస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కారు హైవే రోడ్డు మెయిన్ లైన్‌పై మీరట్ వైపు వేగంగా దూసుకువెళుతోంది. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మధ్యలో నిలబడి ఉన్నారు.
ట్రాఫిక్‌ను మళ్లీస్తూ ఉన్నారు. ఓ ట్రాఫిక్ పోలీసు కార్లు టర్న్ తీసుకునే చోట నిలబడి ఉన్నాడు. ఆ కారు వేగంగా ఆయన వైపు దూసుకు వచ్చింది. ఆయన భయపడిపోయాడు. కారు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పాపం.. తప్పించుకోలేకపోయాడు. కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కారు ఢీకొన్న వేగానికి గాల్లో పల్టీలు కొట్టి, దూరంగా ఎగిరిపడ్డాడు. వెనకాల ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఇది చూశాడు. పరిగెత్తుకుంటూ గాయపడ్డ ట్రాఫిక్ పోలీస్ దగ్గరకు వెళ్లాడు. యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ కారు ఆపకుండానే పారిపోయాడు. పోలీసులు అతడ్ని పట్టుకుని బొక్కలో వేశారు.
ఇవి కూడా చదవండి
శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఉదయం పది గంటలకు..
లా కాలేజ్ రేప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..