Alert To TTD Devotees: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ఉదయం పది గంటలకు..
ABN , Publish Date - Aug 24 , 2025 | 08:57 PM
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. రేపు పలు టికెట్లను అందుబాటులోకి తేనుంది.
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. 2025, నవంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (300 రూపాయలు) టికెట్లను రేపు (సోమవారం) అందుబాటులోకి తేనుంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. టికెట్లు కావాలనుకునే వారు https://ttdevasthanams.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
తిరుమల, తిరుపతి వసతి (రూము బుకింగ్) టికెట్లు కూడా రేపు అందుబాటులోకి రానున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి బుకింగ్ అందుబాటులో ఉంటుంది. https://ttdevasthanams.ap.gov.in/లోకి వెళ్లి ఆన్‌లైన్ సేవలు ఎంచుకోవాలి. అక్కడ వసతిలోకి వెళ్లి రూములు బుక్ చేసుకోవచ్చు. టికెట్లకు సంబంధించి దళారీలను నమ్మి మోసపోవద్దని టీటీడీ హెచ్చరించింది. టీటీడీ అఫిషియల్ వెబ్‌సైట్‌లో కానీ, మొబైల్ అప్లికేషన్‌లో కానీ టికెట్లు బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
ఈ ఏనుగుకు ఎంత కోపం వచ్చిందో చూడండి.. మనుషులు ఇప్పటికైనా మారకపోతే..