Kolkata Law College Case: లా కాలేజ్ రేప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
ABN , Publish Date - Aug 24 , 2025 | 08:17 PM
మొబైల్ ఫోన్ లోకేషన్ నేరం జరిగిన సమయంలో అక్కడే ఉన్నట్లు తేలింది. సెక్యూరిటీ గార్డుకు యువతిపై లైంగిక దాడి దాడి జరుగుతున్నట్లు తెలుసు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిపోయి గార్డు రూముకు లాక్ వేశాడు.
కోల్‌కతా లా కాలేజ్ (Kolkata Law College Case) విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసుకు సంబంధించి 650 పేజీల ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్‌షీటులో ఏముందంటే.. ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందనటం నిజమే. ఫోరెన్సిక్ సాంపిల్స్‌తో నిందితుల డీఎన్‌ఏ మ్యాచ్ అయింది. జూన్ 25వ తేదీన కాలేజీ క్యాంపస్‌లో బాధిత విద్యార్థినిపై ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాతో పాటు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీలు సామూహిక అత్యాచారం జరిపారు.
ఈ కేసులో సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీ కూడా భాగమయ్యాడు. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. అందులో నిందితులు బాధితురాలిని ఈడ్చుకెళుతున్న, బంధించిన దృశ్యాలు ఉన్నాయి. నిందితుల్లో ఒకరి ఫోన్‌లో బాధితురాలికి సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్నాయి. లైంగిక దాడి చేస్తున్నపుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర మొబైల్ ఫోన్ పెట్టి ఆ వీడియోలు తీశాడు(College Gang Case Filmed). ఆ వీడియోలు చూపించి చాలా సార్లు ఆమెపై అత్యాచారం చేశారు. వీడియోలలోని నిందితుల వాయిస్.. సాంపిల్స్‌లోని వాయిస్ మ్యాచ్ అయింది.
మొబైల్ ఫోన్ లోకేషన్ నేరం జరిగిన సమయంలో అక్కడే ఉన్నట్లు తేలింది. సెక్యూరిటీ గార్డుకు యువతిపై లైంగిక దాడి దాడి జరుగుతున్నట్లు తెలుసు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిపోయి గార్డు రూముకు లాక్ వేశాడు. అందుకే అతడి పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. సంఘటన జరగడానికి ముందు మనోజిత్ మిశ్రా(Monojit Mishra) ఎనిమిది సార్లు అరెస్ట్ అయ్యాడు. అతడి స్నేహితులు అతడికి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకువచ్చారు. ఆ నేర స్వభావమే ఇంతటి దారుణానికి ఒడిగట్టేలా చేసింది.
ఇవి కూడా చదవండి
రెచ్చిపోయిన యువతి.. పబ్లిక్‌గా మందు తాగొద్దన్నందుకు..
మరీ ఇంత దారుణమా.. 1 కి.మీ రైడ్ కోసం 425 రూపాయలు..