Share News

Public Drinking Caught On CCTV: రెచ్చిపోయిన యువతి.. పబ్లిక్‌గా మందు తాగొద్దన్నందుకు..

ABN , Publish Date - Aug 24 , 2025 | 06:57 PM

ఈ దాడిలో నిరుపమ్‌కు బాగా గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న మిగిలిన వాళ్లు గొడవ ఆపారు. నిరుపమ్ నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. చికిత్స అనంతరం పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు.

Public Drinking Caught On CCTV: రెచ్చిపోయిన యువతి.. పబ్లిక్‌గా మందు తాగొద్దన్నందుకు..
Public Drinking Caught On CCTV

పశ్చిమ బెంగాల్‌లో ఓ దారుణం సంఘటన చోటుచేసుకుంది. మంచి చెప్పిన ఓ టీచర్‌పై కొంతమంది యువకులు, ఓ యువతి దాడికి తెగబడ్డారు(Belgharia Teacher Attacked). విచక్షణా రహితంగా కొట్టారు. పబ్లిక్‌లో మందు తాగుతున్న వారిని అడ్డుకోవటంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 24 పరగనాస్ జిల్లా, బల్గేరియాకు చెందిన నిరుపమ్ పాల్ ఆర్ట్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. శనివారం అతడు రెసిడెన్షియల్ ఏరియాలో నడుచుకుంటూ వెళుతున్నాడు.


రోడ్డు పక్క కొంతమంది యువకులు, ఓ యువతి మందు తాగుతూ కనిపించారు. నిరుపమ్‌కు అది తప్పుగా అనిపించింది. వెంటనే వారి దగ్గరకు వెళ్లాడు. ‘పబ్లిక్‌‌గా ఇలా మందు తాగటం మంచిది కాదు’ అని హిత బోధ చేశాడు(Protesting Public Drinking). అతడి మాటలు మైకంలో ఉన్నవారికి కోపం తెప్పించాయి. ‘మిమ్మల్ని తాగొద్దనడానికి నువ్వు ఎవడవిరా’ అంటూ ఫైర్ అయ్యారు. అతడిపై దాడి చేయటం మొదలెట్టారు. యువకుల కంటే ఆ యువతి రెచ్చిపోయి ప్రవర్తించింది. నిరుపమ్‌పై విచక్షణా రహితంగా దాడి చేసింది.


ఈ దాడిలో నిరుపమ్‌కు బాగా గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న మిగిలిన వాళ్లు గొడవ ఆపారు. నిరుపమ్ నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. చికిత్స అనంతరం పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు(Public Drinking Caught On CCTV). ఈ సంఘటన‌పై నిరుపమ్ బంధువు మాట్లాడుతూ.. ‘నేను ఇంట్లో నిద్రపోతూ ఉన్నాను. మా అంకుల్(నిరుపమ్)నాకు ఫోన్ చేశాడు. తనను ఎవరో కొట్టారని చెప్పాడు. ముక్కునుంచి బాగా రక్తం కారుతోందని చెప్పాడు. అక్కడున్న వాళ్లు మా అంకుల్‌ను రక్షించారట. వాళ్లు ఆయన్ని చంపుతామని కూడా బెదిరించారట’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఓటమికి తప్పుడు సాకులు చెప్పొద్దు.. రాజ్‌ఠాక్రేకు సీఎం క్లాస్

'స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచే దిశగా కృషి చేయాలి': అమిత్ షా

Updated Date - Aug 24 , 2025 | 06:57 PM