Share News

BREAKING: ఎలక్ట్రిక్‌ వాహనాలకు టోల్‌ప్లాజాలలో టోల్‌ ఫ్రీ..

ABN , Publish Date - Aug 23 , 2025 | 10:39 AM

అన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలకు టోల్‌ప్లాజాలలో టోల్‌ మినహాయింపు కల్పిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనగోలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

BREAKING:  ఎలక్ట్రిక్‌ వాహనాలకు టోల్‌ప్లాజాలలో టోల్‌ ఫ్రీ..

మహారాష్ట్ర: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలకు టోల్‌ప్లాజాలలో టోల్‌ మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనగోలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్త అప్‌డేట్ చేయబడుతుంది..


దేశంలో పెరుగుతన్న కాలుష్యం దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కాలుష్యం తగ్గించే దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఎలాక్ట్రిక్ వాహనాలకు టోల్ మినాహాయింపు ప్రకటించింది. ఎలాక్ట్రిక్ కార్లు, బైకులకు టోల్ ఫ్రీ చేస్తూ..నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రజలు ఎలాక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతారని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. దీనితో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న ఎలాక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఏర్పాడుతాయని భావిస్తుంది. గతంలో ఢిల్లీలో వాహన కాలుష్యంతో ఏర్పడిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోనూ వాహన కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం టోల్ ట్యాక్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Aug 23 , 2025 | 10:53 AM