Share News

Breaking News: శ్రవణ్ రావు అరెస్ట్

ABN , First Publish Date - May 13 , 2025 | 07:09 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: శ్రవణ్ రావు అరెస్ట్

Live News & Update

  • May 13, 2025 20:55 IST

    ఐదుగురు చిన్నారులు గల్లంతు..

    • కడప: బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లెలో విషాదం

    • మల్లెపల్లె చెరువులో ఈతకు దిగి ఐదుగురు చిన్నారులు గల్లంతు

    • గల్లంతయిన పిల్లల కోసం గాలిస్తున్న గజఈతగాళ్లు

    • చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది

    • చరణ్, తరుణ్, పార్థు, హర్ష, దీక్షిత్‌గా గుర్తింపు

    • వేసవి సెలవులు కావడంతో బంధువులు ఇంటికి వచ్చిన చిన్నారులు

  • May 13, 2025 20:50 IST

    శ్రవణ్ రావు అరెస్ట్

    • హైదరాబాద్: సీసీఎస్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు

    • చీటింగ్ చేసిన కేసులో శ్రవణ్ రావుపై సీసీఎస్‌లో కేసు నమోదు

    • అఖండ ఎంటర్‌ప్రైజెస్‍కి రూ.6 కోట్లు మోసం చేశారన్న కేసులో అరెస్ట్

  • May 13, 2025 20:48 IST

    ఆ అధికారులపై చర్యలు తీసుకోండి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

    • మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి అటవీ భూములను రక్షించలేని వారిపై ప్రభుత్వం చర్యలు

    • పెద్దిరెడ్డి కుటుంబీకులపైనా క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం నిర్ణయం

    • విజిలెన్స్ డీజీ నివేదికతో చర్యలకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం

    • చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం అటవీ, ప్రభుత్వ బుగ్గమఠం భూముల ఆక్రమణలపై విజిలెన్స్ డీజీ నివేదిక

    • అటవీ భూములను సంరక్షించలేకపోయిన అధికారులపై శాఖాపరమైన చర్యలు

  • May 13, 2025 19:54 IST

    PSR బెయిల్ పిటిషన్‌.. విచారణ వాయిదా..

    • విజయవాడ: PSR బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 15కి వాయిదా

    • APPSC అక్రమాల కేసులో ఆంజనేయులు బెయిల్ పిటిషన్‌

    • కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు విజయవాడ కోర్టు ఆదేశం

  • May 13, 2025 19:54 IST

    చెంచులకు ఇళ్లు..

    • ప్రతిపక్ష MLAలకు ఇందిరమ్మ ఇళ్ళ కోటా కేటాయిస్తాం: పొంగులేటి

    • చెంచులకు ఓకే దశలో 9 వేల ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి

    • ఏపీలో కలిసిన 7 మండలాల ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం: పొంగులేటి

  • May 13, 2025 19:41 IST

    ఏపీ లిక్కర్ స్కామ్‌... మళ్లీ సోదాలు..

    • ఏపీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌లో సోదాలు

    • 3చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఏపీ సిట్ అధికారులు

    • కోహినూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌, యజమానుల ఇళ్లలో సోదాలు

  • May 13, 2025 17:53 IST

    కాల్పుల విరమణ.. కేంద్రం ప్రకటన..

    • మే 10 పాక్‌ DGMO నుంచి ఫోన్‌ వచ్చింది: రణ్‌ధీర్‌ జైస్వాల్‌

    • DGMOల భేటీలో కాల్పుల విరమణకు నిర్ణయం తీసుకున్నారు: రణ్‌ధీర్‌ జైస్వాల్‌

    • కాల్పుల విరమణ ప్రతిపాదన పాకిస్థాన్‌ నుంచే వచ్చింది: రణ్‌ధీర్‌ జైస్వాల్‌

    • జమ్ముకశ్మీర్‌లో విషయంలో ఎలాంటి మార్పులు లేవు: రణ్‌ధీర్‌ జైస్వాల్‌

    • POKను ఖాళీ చేయించాలన్నదే భారత్‌ విధానం: రణ్‌ధీర్‌ జైస్వాల్‌

    • కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదు: రణ్‌ధీర్‌ జైస్వాల్‌

    • ద్వైపాక్షిక విధానంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం: రణ్‌ధీర్‌ జైస్వాల్‌

  • May 13, 2025 17:51 IST

    సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ

    • ఢిల్లీ: పదవీ విరమణ చేసిన 51వ సీజేఐ సంజీవ్ ఖన్నా

    • సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా గౌరవార్థం వీడ్కోలు కార్యక్రమం

    • రేపు సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న BR గవాయ్

  • May 13, 2025 17:50 IST

    వల్లభనేని వంశీకి బెయిల్‌..

    • విజయవాడ: వల్లభనేని వంశీకి బెయిల్‌

    • సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్‌

    • షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

    • వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురికి బెయిల్‌

  • May 13, 2025 16:35 IST

    ఎలాంటి విభేదాలు లేవు: హరీశ్‌రావు

    • BRSలో ఎలాంటి విభేదాలు లేవు: హరీశ్‌రావు

    • కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా: హరీశ్‌రావు

    • కేసీఆర్‌కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను: హరీశ్‌రావు

    • కేసీఆర్‌ ఆదేశాలను పాటిస్తా: మాజీ మంత్రి హరీశ్‌రావు

  • May 13, 2025 16:21 IST

    నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

    • భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • 1281 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

    • 346 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

  • May 13, 2025 16:04 IST

    నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం: ప్రధాని మోదీ

    • మన అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచినవాని నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం: ప్రధాని మోదీ

    • మీరు గురిచూసిన కొట్టిన దెబ్బ శత్రు స్థావరాలు మట్టిలో కలిసిపోయాయి: ప్రధాని మోదీ

    • భారత త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని మట్టికరిపించాయి: మోదీ

    • పాక్ సైన్యానికి స్పష్టమైన సందేశం ఇచ్చా: ప్రధాని మోదీ

    • పాక్‌లో ఎక్కడైనా ప్రశాంతంగా శ్వాస తీసుకునే అవకాశం లేకుండా చేశాం: ప్రధాని మోదీ

    • మన డ్రోన్లు, మిస్సైల్స్‌ పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించాయి: ప్రధాని మోదీ

    • పాక్ సైన్యానికి నిద్రలేని పరిస్థితి సృష్టించాం: మోదీ

    • పాక్ భూభాగంలో ఏ స్థావరాన్ని అయినా గురిచూసి కొట్టగలమని నిరూపించాం: ప్రధాని మోదీ

    • ఆపరేషన్ సిందూర్‌ భారత్‌ ఆత్మ విశ్వాసాన్ని కొత్త ప్రమాణాలు లిఖించింది: మోదీ

    • మన స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ ఎంతో ప్రయత్నించింది: ప్రధాని మోదీ

    • పాక్ విమానాలు, మిస్సైల్స్‌ మన ముందు చిత్తైపోయాయి: ప్రధాని మోదీ

    • భారత లక్ష్మణ రేఖ ఇప్పుడు ఎంతో సురక్షితం: ప్రధాని మోదీ

    • మళ్లీ దాడి చేస్తే భారత్‌ గట్టిగా జవాబిస్తుంది: ప్రధాని మోదీ

    • న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌ను భారత్‌ ఉపేక్షించదు: మోదీ

    • ఉగ్రవాదులు, వారి వెనుకున్నవారిని వేర్వేరుగా భారత్ చూడదు: ప్రధాని మోదీ

    • 15 నిమిషాల్లో సరిహద్దుల ఆవల శక్తులను భగ్నం చేశారు: ప్రధాని మోదీ

    • ఇదంతా ప్రొఫెషనల్‌ సామర్థ్యంతోనే సాధ్యం: మోదీ

    • భారత్ సైన్యం దాడితో శత్రుదేశం డీలా పడిపోయింది: మోదీ

    • ఎప్పుడు దాడి జరిగిందో కూడా కనిపెట్టలేకపోయింది: మోదీ

    • ఎంతో కచ్చితత్వంతో ఎంతో నైపుణ్యంతో చేసిన దాడి ఇది: ప్రధాని మోదీ

    • పౌర విమానాలను అడ్డుపెట్టుకుని పాక్‌ కుయుక్తులు పన్నింది: ప్రధాని మోదీ

  • May 13, 2025 15:46 IST

    అదంపూర్‌ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ ప్రసంగం

    • పాక్‌కు భారత వాయుసేన సత్తా చూపించారంటూ ప్రశంసలు

    • యుద్ధ క్షేత్రంలోనూ భారత్‌ మాతాకీ జై నినాదాలు చేశాం: ప్రధాని మోదీ

    • మన జయ ద్వానాలు ప్రపంచమంతా విన్నది: ప్రధాని మోదీ

    • భారత్‌ మాతాకీ జై అనేది ప్రతీ పౌరుడి నినాదం: ప్రధాని మోదీ

    • అణు బాంబు హెచ్చరికలను సైతం చిత్తు చేశాం: మోదీ

    • ప్రతీ పౌరుడూ గర్వపడేలా మీరు చేశారు: ప్రధాని మోదీ

    • మీరందరూ చరిత్ర సృష్టించారు: ప్రధాని మోదీ

    • మీ కోసమే నేను ఇక్కడికి వచ్చా: ప్రధాని మోదీ

    • వీరులను చూసినప్పుడు జీవితం దన్యం: మోదీ

    • ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సంప్రదాయం.. మన విధానం: మోదీ

    • మన సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలు భావితరాలకు గొప్ప ప్రేరణ: ప్రధాని

    • ఈ భూమి నుంచి వీర సైనికులు అందరికీ సెల్యూట్‌: మోదీ

    • వీర సైనికుల పరాక్రమంతో ఆపరేషన్ సిందూర్‌ నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది: ప్రధాని మోదీ

    • మన సైన్యం చేపట్టిన ఈ పరాక్రమం భారత్ సామర్థ్యానికి ప్రతిరూపం: ప్రధాని మోదీ

    • భారత్‌ చూపిన ఈ పరాక్రమం త్రివిధ దళాల త్రివేణీ సంగమం: ప్రధాని మోదీ

  • May 13, 2025 15:13 IST

    ఊపిరి ఆడడం లేదు: వల్లభనేని వంశీ..

    • విజయవాడ: తనకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు తెలిపిన వంశీ

    • ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నా: వల్లభనేని వంశీ

    • వంశీని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందించాలని ఆదేశం

    • జైలు అధికారులకు విజయవాడ ప్రత్యేక కోర్టు ఆదేశాలు

  • May 13, 2025 13:24 IST

    ఢిల్లీలోని ఏపీ భవన్‌లో బాలాజీ ఆలయ కూల్చివేతను..

    • నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం.

    • నిన్న బాలాజీ ఆలయం కూల్చివేతపై ABNలో వరుస కథనాలు.

    • ఏపీ భవన్‌లో ఆక్రమణల తొలగింపు, ప్రార్థనా మందిరం తొలగింపుపై అధికారులతో మాట్లాడిన సీఎం.

    • ఏపీ భవన్ ప్రాంగణంలో 0.37ఎకరాల్లో ఆక్రమణలు గుర్తింపు.

    • ఆక్రమణల తొలగింపుపై తీసుకున్న చర్యలను.. సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు.

    • ఆక్రమణలతో పాటు రెండు ప్రార్థన మందిరాలను కూడా.. తొలగించాల్సి ఉందని సీఎం చంద్రబాబుకు తెలిపిన అధికారులు.

    • ప్రజల మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకోవద్దని సీఎం సూచన.

    • ప్రార్థనా మందిరాల తొలగింపుపై సంయమనం పాటించాలన్న చంద్రబాబు.

    • సీఎం చంద్రబాబు సూచనతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిలిపివేత.

  • May 13, 2025 13:21 IST

    పంజాబ్: ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన ప్రధాని మోదీ

    PM-Modi.jpg

    • ఆదంపూర్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, జవాన్లతో మాట్లాడిన మోదీ

    • ఆపరేషన్ సిందూర్‌ వివరాలను ప్రధానితో పంచుకున్న జవాన్లు

    • ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసినట్టు పాక్ దుష్ప్రచారం

    • ఆదంపూర్ వెళ్లి పాక్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన మోదీ

    • ఆదంపూర్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, సైనికులను కలిశా: మోదీ

    • ధైర్యం, దృఢ సంకల్పానికి సైనికులు ప్రతిరూపం.

    • దేశం కోసం మన సాయుధ దళాల సాహసానికి.. భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది.

  • May 13, 2025 13:18 IST

    శ్రీసత్యసాయి: కల్లితండాకు వైఎస్ జగన్

    • వీరజవాన్ మురళినాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన జగన్

    • అండగా ఉంటామని మురళినాయక్ తల్లిదండ్రులుకు జగన్ హామీ

  • May 13, 2025 12:29 IST

    షోపియాన్‌ జిల్లాలో ముగిసిన ఎన్‌కౌంటర్..

    • భద్రతా బలగాలకు, లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులకు మధ్య కాల్పులు.

    • భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం.

    • భారీగా చేరుకున్న భద్రత బలగాలు.

  • May 13, 2025 12:01 IST

    సీబీఎస్‌ఈ ఫలితాల్లో విజయవాడ (99.60 శాతం)లో అధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది.

    • త్రివేండ్రం - 99.32 శాతం.

    • చెన్నై - 97.39 శాతం.

    • బెంగళూరు - 95.95 శాతం.

    • ఢిల్లీ వెస్ట్ - 95.37 శాతం.

    • ఢిల్లీ ఈస్ట్ - 95.06 శాతం.

    • చండీగఢ్ - 91.61 శాతం.

    • పంచకుల - 91.17 శాతం.

    • పూణే - 90.93 శాతం.

    • అజ్మీర్ - 90.40 శాతం.

    • భువనేశ్వర్ - 83.64 శాతం.

    • గౌహతి - 83.62 శాతం.

    • డెహ్రాడూన్ - 83.45 శాతం.

    • పాట్నా - 82.86 శాతం.

    • భోపాల్ - 82.46 శాతం.

    • నోయిడా - 81.29 శాతం

    • 79.3 శాతంతో ప్రయాగ్‌రాజ్ చిట్ట చివరన ఉంది.

  • May 13, 2025 11:52 IST

    సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల.. విజయవాడ టాప్..

    • సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలు విడుదలయ్యాయి.

    • 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

    • మొత్తం 17,04,367 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు.

    • వీరిలో 16,92,794 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

    • 14,96,307 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

  • May 13, 2025 11:37 IST

    వల్లభనేని వంశీకి మళ్లీ షాక్..

    • విజయవాడ: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ, మరో ఐదుగురిని ఏసీబీ కోర్టులో హాజరుపరచిన పోలీసులు.

    • రేపటి వరకు ఒక్కరోజు రిమాండ్ పొడిగించిన కోర్టు.

    • ఇదే కేసులో వంశీ మూడోసారి వేసిన బెయిల్ పిటీషన్‌పై నేడు మధ్యాహ్నం తీర్పు వెలువరించనున్న కోర్టు.

  • May 13, 2025 11:13 IST

    ఫోన్ కాల్ ఎఫెక్ట్.. శంషాబాద్‌లో టెన్షన్ టెన్షన్..

    • ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ విమానంకి బాంబు బెదిరింపు.

    • కొలకత్తా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.

    • విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చి వేస్తామంటూ రాసిన అగంతకులు.

    • విమానంలో బాంబు బెదిరింపు వ్యవహారాన్ని వెంటనే ఏటీసీకి తెలిపిన పైలట్.

    • హైదరాబాద్‌కు చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.

    • నాలుగు గంటలపాటు తనిఖీ చేసి బాంబు లేదని తేల్చిన అధికారులు.

  • May 13, 2025 10:43 IST

    వారిని పట్టిస్తే రూ. 20 లక్షల బహుమతి.. ఫోటోలు ఇవే..

  • May 13, 2025 10:43 IST

    14 మంది ప్రాణాలు తీసిన కల్తీ మద్యం..

    పంజాబ్: అమృత్‌సర్‌లోని మజితలో కల్తీ మద్యం సేవించి 14 మంది మరణించగా, ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ అంశంపై అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని మాట్లాడుతూ.. మజితలో విషాదం జరిగింది. సోమవారం రాత్రి మద్యం సేవించిన వారి పరిస్థితి విషమంగా ఉందని 5 గ్రామాల నుండి మాకు సమాచారం వచ్చింది. వెంటనే వైద్య బృందాలను పంపించాము. ప్రభుత్వ వైద్య బృందాలు ఇప్పటికీ ఇంటింటికీ తిరుగుతున్నాయి. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రులకు తరలించాము. ఇప్పటివరకు 14 మంది మరణించారు. ప్రభుత్వం సాధ్యమైనంతవరకు సహాయం అందిస్తోంది. ఈ మరణాల సంఖ్య పెరగకుండా బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తాం. కల్తీ మద్యం సరఫరా చేసిన వారిని అరెస్ట్ చేశామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’ అని చెప్పారామె.

  • May 13, 2025 10:15 IST

    జమ్మూ కాశ్మీర్‌లో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు..

    • భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకున్నాయి.

    • మూత పడిన స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటున్నాయి.

    • జనజీవనం సాధారణంగా కొనసాగుతోంది.

  • May 13, 2025 10:02 IST

    హైదరాబాద్‌లో దారుణం..

    • హైదరాబాద్‌లో చెన్నై విద్యార్థినిని రేప్ చేసిన ఇద్దరు యువకులు.

    • చెన్నైలో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్‌కు పిలిపించిన తన స్నేహితుడు అజయ్.

    • కూకట్‌పల్లిలోని లేడీస్ హాస్టల్లో ఉంటున్న యువతిని పార్టీ చేసుకుందామని, తన స్నేహితుడు హరి ఫ్లాట్‌కు రావాలని పిలిచిన అజయ్.

    • అజయ్ పిలుపు మేరకు నిజాంపేటలో రాజీవ్ గృహకల్పలోని హరి ఫ్లాట్‌కు వెళ్లిన యువతి.

    • ఫ్లాట్‌కు వెళ్లిన తర్వాత యువతికి బలవంతంగా మద్యం తాగించి, మత్తులోకి వెళ్లగానే ఆమెను రేప్ చేసిన అజయ్, హరి.

    • యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బాచుపల్లి పోలీసులు.

    • నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.

  • May 13, 2025 09:54 IST

    పంజాబ్: అమృత్‌సర్‌లో విషాదం.

    • కల్తీ మద్యం తాగి 12 మంది మృతి.

    • మరో ఐదుగురి పరిస్థితి విషమం.

    • ఆస్పత్రిలో చికిత్స, ఘటనపై విచారణ చేపట్టిన అమృత్‌సర్ పోలీసులు.

  • May 13, 2025 09:48 IST

    పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం..

    • వినుకొండ మండలం శివాపురం వద్ద రోడ్డు ప్రమాదం.

    • లారీలో ఢీకొన్న మినీ లారీ, ముగ్గురు మృతి.

    • ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.

  • May 13, 2025 09:28 IST

    ఢిల్లీ: పాకిస్థాన్‌పై ద్వైపాక్షిక ఒత్తిడికి సిద్ధమైన కేంద్రం.

    • ఆపరేషన్ సిందూర్‌తో అన్నివిధాలా దెబ్బతీసిన భారత్.

    • ఇప్పుడు మరో కోణంలో కూడా ఒత్తిడికి సిద్ధమైన కేంద్రం.

    • దేశంలో అందుబాటులో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లు, ముఖ్యమైన అధికారులకు ఆపరేషన్ సిందూర్ వివరాలు పంచుకొనున్నట్లు సమాచారం.

    • ఉగ్రవాద నిర్మూలనలో వేసిన ముందడుగు, చోటుచేసుకున్న పరిణామాలు వివరాలు అందించనున్నట్లు సమాచారం.

    • మిలిటరీ చర్యకు కారణాలు చెప్పి.. మద్దతు కొనసాగించాలని కొరనున్నట్లు సమాచారం.

    • విదేశాంగ మంత్రి, విదేశాంగ శాఖ కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు పలు దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నట్లు సమాచారం.

    • మరోవైపు విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు కూడా వివరాలు ఇవ్వనున్న కేంద్రం.

    • ఈనెల 19న కమిటీ ఛైర్మన్ శశిథరూర్ నేతృత్వంలో జరిగే సమావేశంలో ఆపరేషన్ సిందూర్ విషయాలు చెప్పనున్న విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ.

  • May 13, 2025 09:17 IST

    తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సైబర్ నేరస్తుల కోసం స్పెషల్ ఆపరేషన్

    • 20 మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేసిన టీజీసిఎస్‌బీ.

    • సైబర్ క్రిమినల్స్‌కు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సరఫరా చేస్తున్న ఏజెంట్లతో పాటు సహకరిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.

    • మే 1 నుంచి 10 వరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.

    • అరెస్ట్ అయిన వారిలో 14 మంది మ్యూల్ ఖాతాదారులు ఆరుగురు ఏజెంట్లు

    • పట్టుబడిన నిందితుల్లో తెలంగాణలో 60 కి పైగా కేసులు.

    • దేశవ్యాప్తంగా 515 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.

    • ప్రాథమిక విచారణలో 27మ్యూల్ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 44.37 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు.

    • తెలంగాణలోనే ఐదుగురు నిందితులు చెక్కుల ద్వారా 22,64,500 విత్ డ్రా చేసిన నిందితులు.

    • నిందితులలో ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, బ్యాంకు ఉద్యోగి.

    • వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ట్రేడింగ్ పార్ట్ టైం ఉద్యోగాల పేరట మోసాలు.

    • అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుంచి 20 మొబైల్ ఫోన్లు 28 సిమ్ కార్డులు 4 ఏటీఎంలు.

    • 5 చెక్కుబుక్కులు రెండు పాన్ కార్డులు రెండు రబ్బర్ స్టాంపులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం.

  • May 13, 2025 08:28 IST

    విమానాలు రద్దు..

    • అమృత్‌సర్‌తో పాటు మరో 5 ప్రదేశాలకు విమానాలు రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.

    • మే 13న జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌లకు, అక్కడి నుండి బయలుదేరే విమానాలను ఇండిగో రద్దు చేసింది.

    • తాజా పరిణామాల దృష్ట్యా, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌లకు.. అక్కడి నుంచి బయలుదేరే విమానాలను మే 13వ తేదీన రద్దు చేయడం జరిగింది అని ఇండిగో ప్రకటించింది.

  • May 13, 2025 08:09 IST

    పవన్ ఇంట్రస్టింగ్ ట్వీట్..

    • అమరావతి: తిరువల్లువార్ 'తిరుక్కురల్' నుండి ఒక సారాంశం.

    • ఎలుకలన్నీజేరి సముద్రము వలే ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది.

    • శేషనాగు చేసే ఒక్క హుంకారం మాత్రం చేతనే అవన్మీ నశిస్తాయి.

  • May 13, 2025 08:07 IST

    ముగియనున్న వంశీ కస్టడీ..

    • విజయవాడ: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ, మరో ఐదుగురికి నేటితో ముగియనున్న రిమాండ్.

    • ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట వంశీని హాజరు పరచనున్న పోలీసులు.

  • May 13, 2025 07:09 IST

    బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్..

    Gold Rate Today: నిన్న హైదరాబాద్ మహా నగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 96880 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88800 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72660 దగ్గర ట్రేడ్ అయింది.

    పూర్తి వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • May 13, 2025 07:09 IST

    Chittoor: చిత్తూరులో ఘనంగా మొదలైన నడివీధి గంగమ్మ జాతర వేడుకలు.

    • తొలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి వేడుకలను ప్రారంభించిన వంశపారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబం.

    • సీకే బాబు దంపతులతో కలిసి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దంపతులు.

    • జాతర వేడుకల్లో మొక్కులు తీర్చుకునేందుకు పోటెత్తిన భక్తజనం.

    • ఇవాళ రేపు రెండు రోజులపాటు కొనసాగనున్న జాతర.

    • స్థానిక వాసులే కాకుండా సమీప పొరుగు రాష్ట్రలైన తమిళనాడు, కర్ణాటక నుంచి వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన భక్తజనం.