Tiger: అమ్మో.. పులి చూడండి.. ఎంత దర్జగా తిరుగుతోందో..
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:58 AM
తేయాకు తోటల్లో పులి సంచరిస్తుండడంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారు. నీలగిరి జిల్లా ఊటీ సమీపంలోని తుమ్మంటి గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న తేయాకు తోటలో పులి ప్రవేశించింది.
- తేయాకు తోటల్లో పులి సంచారం..
చెన్నై: తేయాకు తోటల్లో పులి సంచరిస్తుండడంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారు. నీలగిరి(Neelagiri) జిల్లా ఊటీ(Ooty) సమీపంలోని తుమ్మంటి గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న తేయాకు తోటలో పులి ప్రవేశించింది. ఆ సమయంలో, ఆ మార్గంలో వెళ్తున్న వాహనచోదకులు పులిని గుర్తించి, తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. కొద్దిసేపు ఆ ప్రాంతంలో సంచరించిన పులి, సమీపంలోని అడవిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు, తేయాకు తోటలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళన చెందుతున్నారు. ఊటీ ఫారెస్ట్ రేంజర్ రాంప్రకాష్ నేతృత్వంలో సిబ్బంది తేయాకు తోటకు చేరుకుని కార్మికులకు ధైర్యం చెప్పారు. అలాగే, ఒంటరిగా ఎవరూ విధులు చేపట్టవద్దని ఫారెస్ట్ అధికారులు కార్మికులను హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News