Share News

Karnataka Food Poisoning: గోరుచిక్కుడు కూర విషమై...ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:33 AM

ఆహారం విషతుల్యమై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు.

Karnataka Food Poisoning: గోరుచిక్కుడు కూర విషమై...ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
Karnataka Food Poisoning

  • మరో ముగ్గురి పరిస్థితి విషమం

  • కర్ణాటక రాష్ట్రంలో ఘటన

రాయచూరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఆహారం విషతుల్యమై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సిరవార తాలూకా కడోణి తిమ్మాపురలో మంగళవారం ఈ విషాద ఘటన జరిగిం ది. గ్రామానికి చెందిన రమేశ్‌ నాయక్‌ తన రెండెకరాల పొలంలో సీడ్‌ పత్తిని సాగు చేశారు. కుటుంబ అవసరాల కోసం కొంత భాగంలో కూరగాయలను సాగు చేశారు. అందులో కాసిన గోరు చిక్కుడు కాయలను ఆదివారం ఇంటికి కోసుకురాగా, సోమవారం రాత్రి వండుకుని ఆరుగురు కుటుంబ సభ్యులు తిన్నారు. వారికి మంగళవారం తెల్లవారు జామున వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో గ్రామస్థులు లింగసుగూరు తాలూకా ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగానే రమేశ్‌ నాయక్‌ (38), కూతుళ్లు దీప(6), నాగమ్మ(8) మృతిచెందారు. భార్య పద్మ, కుమారుడు కృష్ణ, మరో కూతురు చైత్ర తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం రాయచూరులోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కవితాళ పీఎ్‌సఐ వెంకటేశ్‌ నాయక్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, పొలంలో కొన్నాళ్ల క్రితం పంటకు పురుగుల మందు పిచికారీ చేశారని, ఈ కారణంగానే గోరుచిక్కుడు విషతుల్యమై ప్రాణాలు తీసి ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 04:33 AM