Tejashwi Yadav Declares: బిహార్‌లోని 243 సీట్లలో పోటీ చేస్తాం
ABN , Publish Date - Sep 15 , 2025 | 06:03 AM
బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలోని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్...
ఆర్జేడీ నేత తేజస్వి సంచలన వ్యాఖ్యలు.. మహా కూటమిలో సీట్ల సర్దుబాటు రచ్చ
పట్నా/న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలోని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము మొత్తం 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. ముజఫర్‌పూర్ జిల్లాలోని కంటి ప్రాంతంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మళ్లీ మనం తిరిగి అధికారంలోకి వస్తున్నాం. మొత్తం 243 స్థానాల్లో మనమే పోటీ చేస్తున్నాం.’’ అని ప్రకటించారు. అంతేకాదు, ముజఫర్‌పూర్ సహా పలు నియోజకవర్గాల పేర్లు చెబుతూ.. ఆయా స్థానాల్లో కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి ముజఫర్‌పూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు, ఓటర్ అధికార్ యాత్ర విజయవంతం కావడంతో రాహుల్ గాంధీతో బిహార్‌లో మరిన్ని యాత్రలకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఓట్ల చోరీ, నిరుద్యోగం, వలసలు, విద్య అంశాలపై ఉద్యమాలతో ఎన్నికల ముందు పార్టీ బలం పుంజుకుంటోందని, రాహుల్‌గాంధీతో రాష్ట్రంలో మరో 9యాత్రలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి