TVK Party: SIR కి వ్యతిరేకంగా గళం విప్పిన టీవీకే పార్టీ
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:52 AM
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కి వ్యతిరేకంగా తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ గళం విప్పింది. 'సర్' ని నిలిపివేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది.
ఢిల్లీ, నవంబర్ 23: తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కి వ్యతిరేకంగా తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ గళం విప్పింది. 'సర్'(SIR Tamil Nadu)ని నిలిపివేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. SIR పై ఇప్పటికే అధికార డీఎంకే పార్టీ సుప్రీంను ఆశ్రయించింది. టీవీకే వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సరిచేయడానికి, దొంగ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల బిహార్ రాష్ట్రంలో సర్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్‌లో విజయవంతంగా అమలు చేసిన ఈ ప్రక్రియను దేశమంతా చేపట్టాలని ఎలక్షన్ కమీషన్(Elections Commission) నిర్ణయించింది. ఓటరు జాబితా కంప్యూటరీకరణ జరిగిన గత రెండు దశాబ్దాలుగా గణనీయమైన మార్పులు సంభవించాయని ఈసీ గుర్తించింది. గతంలో బీహార్‌లో సర్ కారణంగా 68.66 లక్షల ఓటర్లను జాబితా నుండి తొలగించారు.
ఈ తరహా ప్రక్షాళన దేశవ్యాప్తంగా జరపాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సర్ ను ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. సర్ తోనే బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే గెలిచిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejashwi Yadav on SIR), సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సర్ ఆటలు సాగనివ్వమని అఖిలేష్ , బెంగాల్ సీఎం మమత అన్నారు. అలానే తమిళనాడులోని అధికార డీఎంకే సైతం సర్ వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసింది. తాజాగా సినీ నటుడు విజయ్ పార్టీకు అదే దారిలో వెళ్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..