Share News

Pakistan Taliban Attack: తాలిబన్ల దాడిలో 19 మంది పాక్‌ సైనికుల మృతి

ABN , Publish Date - Sep 14 , 2025 | 06:24 AM

పాకిస్థాన్‌ తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 19 మంది పాక్‌ సైనికులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. సైనికులు వెళ్తున్న వాహనశ్రేణిపై శనివారం వేకువజాము నాలుగు గంటల సమయంలో..

Pakistan Taliban Attack: తాలిబన్ల దాడిలో 19 మంది పాక్‌ సైనికుల మృతి

ఇస్లామాబాద్‌, సెప్టెంబరు 13: పాకిస్థాన్‌ తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 19 మంది పాక్‌ సైనికులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. సైనికులు వెళ్తున్న వాహనశ్రేణిపై శనివారం వేకువజాము నాలుగు గంటల సమయంలో తహెరీక్‌ ఎ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీపీపీ- పాకిస్థాన్‌ తాలిబన్‌) కాల్పులు జరిపింది. అఫ్ఘానిస్థాన్‌కు సరిహద్దులో ఉన్న పశ్చిమ వజీరిస్థాన్‌ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పర్వత ప్రాంతంలో రెండు వైపుల నుంచి కాల్పులు జరపడంతో సైనికులు అక్కడికక్కడే మరణించారు. అనంతరం తాలిబన్లు సైనికుల వద్ద ఉన్న ఆయుధాలు, డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గత మూడు రోజుల్లో 45 మంది తాలిబన్లను హతమార్చినట్టు సైన్యం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి..

Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్

Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా

For More National News and Telugu News

Updated Date - Sep 14 , 2025 | 06:24 AM